విద్యార్థులకు కొవిడ్ పరీక్షలు
ABN , First Publish Date - 2022-01-25T04:58:07+05:30 IST
పట్టణంలోని సంజాయ్గాంధీకాలనీలో ఉన్న ప్రాథమిక పాఠశాలలో 20 మంది విద్యార్థులకు, ఒక ఉపాధ్యాయురాలికి సోమవారం కొవిడ్ పరీక్షలు నిర్వహించారు.

నాయుడుపేట, జనవరి 24 : పట్టణంలోని సంజాయ్గాంధీకాలనీలో ఉన్న ప్రాథమిక పాఠశాలలో 20 మంది విద్యార్థులకు, ఒక ఉపాధ్యాయురాలికి సోమవారం కొవిడ్ పరీక్షలు నిర్వహించారు. రెండు రోజుల క్రితం ఇదే పాఠశాలలో ఓ ఉపాధ్యాయుడికి కరోనా సోకినట్లు వైద్యులు నిర్ధారించడంతో ఆమేరకు వైద్య సిబ్బంది పాఠశాలలోని విద్యార్థులకు పరీక్షలు నిర్వహించారు.