లేఅవుట్లలో ఇళ్లనిర్మాణాల సంఖ్య పెరగాలి

ABN , First Publish Date - 2022-08-05T05:16:03+05:30 IST

జగనన్న లేఅవుట్లలో ఇళ్లు కట్టుకునే వారిసంఖ్యను పెంచాలని జాయింట్‌ కలెక్టర్‌ కూర్మనాథ్‌ అధికారులకు, సచివాలయ సిబ్బందికి సూచించారు.

లేఅవుట్లలో ఇళ్లనిర్మాణాల సంఖ్య పెరగాలి
హాజరుపట్టి పరిశీలిస్తున్న జాయింట్‌ కలెక్టర్‌ కూర్మనాథ్‌

జేసీ కూర్మనాథ్‌

 మనుబోలు, ఆగస్టు 4: జగనన్న లేఅవుట్లలో ఇళ్లు కట్టుకునే వారిసంఖ్యను పెంచాలని జాయింట్‌ కలెక్టర్‌ కూర్మనాథ్‌ అధికారులకు, సచివాలయ సిబ్బందికి సూచించారు. మండలంలోని కాగితా లపూరు సచివాలయాన్ని గురువారం ఆయన ఆకస్మికంగా తనిఖీ చేశారు. హాజరుపట్టీ, రికార్డులను పరిశీలించారు. కొవిడ్‌ వ్యాక్సినేషన్‌, ఇళ్లనిర్మాణాలపై సచివాలయ సిబ్బందితో సమీక్ష  చేశారు. అనంతరం జేసీ మాట్లాడుతూ పట్టాలు పొందిన ప్రతి లబ్ధిదారుడు ఇల్లు నిర్మించుకునేలా అవ గాహన కల్పించాలన్నారు. సచివాలయాల ద్వారా ప్రజలకు ప్రభుత్వం 545 రకాల సేవలు అంది స్తోందన్నారు. సచివాలయంలో ఎలాంటి పెండింగ్‌ దరఖాస్తులు లేవన్నారు. వివిధ రకాల పౌర సేవలు అందించి సచివాలయం ద్వారా ప్రభుత్వానికి రూ. 1.55లక్షలు జమచేశారన్నారు. కార్య క్రమంలో తహసీల్దార్‌ సుధీర్‌, ఎంపీడీవో వెంకటేశ్వర్లు, మండల విస్తరణాధికారి రమణయ్య, కార్యదర్శి విమల, సర్పంచు చెముడుగుంట ఏడుకొండలు, వైసీపీ నాయకులు రవీంద్ర పాల్గొన్నారు. 

Updated Date - 2022-08-05T05:16:03+05:30 IST