కాంగ్రెస్ పార్టీకి పూర్వ వైభవం తధ్యం
ABN , First Publish Date - 2022-12-07T23:51:35+05:30 IST
అపార అనుభవం, నాయకత్వ పటిమ గల గిడుగు రుద్రరాజును ఏపీ పీసీసీ అధ్యక్షుడిగా అధిష్ఠానం నియమించడం హర్షదాయకమని, ఆయన నేతృత్వంలో కాంగ్రెస్ పార్టీకి రాష్ట్రంలో పూర్వవైభవం రావడం తధ్యమని ఏపీ కాంగ్రెస్ కమిటీ ప్రధాన కార్యదర్శి, నియోజకవర్గ ఇన్‌చార్జ్ చేవూరు శ్రీధర్‌రెడ్డి పేర్కొన్నారు.
ఆత్మకూరు, డిసెంబరు 7 : అపార అనుభవం, నాయకత్వ పటిమ గల గిడుగు రుద్రరాజును ఏపీ పీసీసీ అధ్యక్షుడిగా అధిష్ఠానం నియమించడం హర్షదాయకమని, ఆయన నేతృత్వంలో కాంగ్రెస్ పార్టీకి రాష్ట్రంలో పూర్వవైభవం రావడం తధ్యమని ఏపీ కాంగ్రెస్ కమిటీ ప్రధాన కార్యదర్శి, నియోజకవర్గ ఇన్‌చార్జ్ చేవూరు శ్రీధర్‌రెడ్డి పేర్కొన్నారు. నూతన ఏపీ పీసీసీ అఽధ్యక్షుడిగా నియమితులైన రుద్రరాజు ఈ నెల 9వ తేదీన విజయవాడలో ప్రమాణస్వీకారం చేయనున్న నేపథ్యంలో కాంగ్రెస్ పార్టీ నేతలు, కార్యకర్తలను తరలించేందుకు బుధవారం సన్నాహక కార్యక్రమం చేపట్టారు. ఈ సందర్భంగా పార్టీ కార్యాలయంలో విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ రుద్రరాజు విద్యార్థి దశ నుంచి ఎన్‌ఎస్‌యూఐ, యువజన కాంగ్రెస్ నాయకుడిగా నీతి, నిజాయితీగా వ్యవహరించి అనేక ప్రజా పోరాటాలు చేశారన్నారు. ఈ సందర్భంగా రుద్రరాజు ప్రమాణస్వీకారానికి పార్టీ నేతలు, కార్యకర్తలు అధికసంఖ్యలో తరలివచ్చి విజయవంతం చేయాలని కోరారు. కార్యక్రమంలో జిల్లా యూత్ కాంగ్రెస్ ఉపాధ్యక్షుడు వన్నం నాగరాజు, మర్రిపాడు, ఏఎస్‌పేట, సంగం, ఆత్మకూరు మండలాల కాంగ్రెస్ పార్టీ ఇన్‌చార్జ్‌లు తిరుపాలు, షేక్ ఖాజారంతుల్లా, కొల్లూరు ప్రసాద్, కె హర్షకుమార్ తదితరులు పాల్గొన్నారు.