-
-
Home » Andhra Pradesh » Nellore » citu leaders raly at kavali-MRGS-AndhraPradesh
-
అక్రమ అరె్‌స్టలపై సీఐటీయూ నిరసన
ABN , First Publish Date - 2022-03-17T03:29:24+05:30 IST
కార్మికుల సమస్యలను పరిష్కరించాలని కోరుతూ సీఐటీయూ అనుబంధ కార్మిక సంఘాలు ఇచ్చిన పిలుపు మేరకు చలో విజయవాడ కార్యక్రమాన్ని విఫలం చేసేందుకు పోలీసులు ఎక్కడికక్కడ గృహ నిర్బంధాలు, పనుల వద్ద వేధింపులు, అక్రమ అరె్‌స్టలు చేయడం దారుణమని సీఐటీయూ నాయకులు పేర్కొన్నారు.

కావలి, మార్చి 16: కార్మికుల సమస్యలను పరిష్కరించాలని కోరుతూ సీఐటీయూ అనుబంధ కార్మిక సంఘాలు ఇచ్చిన పిలుపు మేరకు చలో విజయవాడ కార్యక్రమాన్ని విఫలం చేసేందుకు పోలీసులు ఎక్కడికక్కడ గృహ నిర్బంధాలు, పనుల వద్ద వేధింపులు, అక్రమ అరె్‌స్టలు చేయడం దారుణమని సీఐటీయూ నాయకులు పేర్కొన్నారు. స్థానిక ట్రంకురోడ్డులోని అంబేద్కర్ విగ్రహం వద్ద బుధవారం సీఐటీయూ ఆధ్వర్యంలో కార్మికులు నిరసన కార్యక్రమం చేపట్టారు. సీఐటీయూ గౌరవాధ్యక్షుడు పెంచలయ్య మాట్లాడుతూ పోలీసుల అరె్‌స్టలకు దొరకకుండా విజయవాడ వెళ్లిన అంగన్‌వాడీలు, పంచాయతీ కార్మికులను రాష్ట్ర ప్రభుత్వం పోలీసులతో రకరకాలు ఇబ్బందులకు గురిచేయించడం దుర్మార్గమైన చర్య అన్నారు. ఈ కార్యక్రమంలో సీపీఎం నాయకులు వై. కృష్ణమోహన్, పీ.పెంచలనరసింహం, సీఐటీయూ నాయకులు ఆనందరావు, మాలకొండయ్య, మున్సిపల్ కార్మికసంఘ నాయకులు సుబ్బారావు, చినపోలయ్య, బాస్కర్, ఆదిలక్ష్మి, ప్రమీల, చిన్నమ్మ తదితరులు పాల్గొన్నారు.