చినుకు పడితే చిత్తడే..!

ABN , First Publish Date - 2022-10-08T04:54:24+05:30 IST

ఆత్మకూరు మున్సిపాలిటీ పరిధిలోని పలు ప్రాంతాల్లో రహదారులు అధ్వానంగా తయారయ్యాయి. చినుకు పడితే బురదమయంగా మారడంతో ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు.

చినుకు పడితే చిత్తడే..!
గుంతలమయమై అధ్వానంగా ఉన్న రోడ్డు

అధ్వానంగా రహదారులు


ఆత్మకూరు, అక్టోబరు 7 : ఆత్మకూరు మున్సిపాలిటీ పరిధిలోని పలు ప్రాంతాల్లో రహదారులు అధ్వానంగా తయారయ్యాయి. చినుకు పడితే బురదమయంగా మారడంతో   ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు. ఇటీవల కురుస్తున్న వర్షాలకు జేఆర్‌పేట, ఎల్‌ఆర్‌పల్లి, నాగేంద్రపురం తదితర ప్రాంతాల్లో రోడ్లు చిత్తడి, చిత్తడిగా మారాయి. ఆత్మకూరు నుంచి బట్టేపాడు మీదుగా నల్లపురెడ్డిపల్లి, మురగళ్ల, కనుపూరుపల్లికి వెళ్లే రహదారి గుంతలమయమై అధ్వానంగా ఉంది. దాంతో వాహనదారులు, పాదచారులు ప్రయాణం చేయాలంటే నరకయాతన పడుతున్నారు. ఇకనైనా పాలకులు, అధికారులు స్పందించి రోడ్లకు మరమ్మతులు చేయాలని ప్రజలు కోరుతున్నారు.


 

Read more