చెత్త నుంచి సంపద కేంద్రాలను సద్వినియోగం చేసుకోవాలి

ABN , First Publish Date - 2022-03-06T03:46:31+05:30 IST

చెత్త నుంచి సంపద తయారీ కేంద్రాలను సద్వినియోగం చేసుకోవాలని జేసీ గణేష్‌కుమార్‌ కోరారు. కోట మండలం కేశవరం, ఊనుగుంటపాళెం గ్రామాల్లో ఉన్న కేంద్రాలను శనివారం ఆయన తనిఖీ చేశారు.

చెత్త నుంచి సంపద కేంద్రాలను సద్వినియోగం చేసుకోవాలి
వానపాములను పరిశీలిస్తున్న జేసీ గణేష్‌కుమార్‌, అధికారులు

కోట, మార్చి 5:  చెత్త నుంచి సంపద తయారీ కేంద్రాలను సద్వినియోగం చేసుకోవాలని జేసీ గణేష్‌కుమార్‌ కోరారు. కోట మండలం కేశవరం, ఊనుగుంటపాళెం గ్రామాల్లో ఉన్న కేంద్రాలను శనివారం ఆయన తనిఖీ చేశారు.  అనంతరం  కోటలోని ఉపాధి కార్యాలయాన్ని తనిఖీ చేశారు. మండలంలోని 21 పంచాయతీలకు చెందిన ఉపాధి పనుల మస్టర్లను పరిశీలించారు.  జిల్లాలో కొత్తగా 161 చెత్త సంపద తయారీ కేంద్రాలు నిర్మించనున్నామన్నారు. అందులో 101 కేంద్రాలకు స్థలాలు కేటాయించామన్నారు. మరో 60 కేంద్రాలకు స్థల సేకరణ జరగాల్సి ఉందన్నారు. జిల్లాలో 1.19 కోట్లు మొక్కలను నాటితే 1.7 కోట్ల మొక్కలు బతికాయన్నారు.  కోటలో 9వేల మొక్కలు నాటితే దాదాపుగా అన్ని మొక్కలు బతికాయన్నారు. ఆయన వెంట డ్వామా పీడీ తిరుపతయ్య, ఏపీడీ గోపి, ఎంపీడీవో భవాని, ఏపీవో విజయమ్మ, ఈసీ నాగభూషణం, టీఏలు సుమన్‌, శాంతి తదితరులు ఉన్నారు.

Updated Date - 2022-03-06T03:46:31+05:30 IST