చెన్నకేశవుడి సేవలో బొల్లినేని
ABN , First Publish Date - 2022-08-14T03:09:52+05:30 IST
మండలంలోని కోవివారిపల్లెలో జరుగుతున్న చెన్నకేశవస్వామివారి ఉత్సవాల్లో శనివారం మాజీ ఎమ్మెల్యే బొల్లినేని వెంకట రా

కొండాపురం, ఆగస్టు13: మండలంలోని కోవివారిపల్లెలో జరుగుతున్న చెన్నకేశవస్వామివారి ఉత్సవాల్లో శనివారం మాజీ ఎమ్మెల్యే బొల్లినేని వెంకట రామారావు పాల్గొన్నారు. స్వామివారికి పూజలు చేసి, తీర్ధప్రసాదాలు అందుకున్నారు. అనంతరం వెలిగండ్లలో టీడీపీ నాయకుడు తోట మహేష్ కుమారుడి పెళ్లిలో పాల్గొని వధూవరులను ఆశీర్వదించారు. ఆయన వెంట జడ్పీ మాజీ చైర్మన్ చెంచలబాబు యాదవ్, నాయకులు తల్లపనేని లక్ష్మీనారాయణ, యారవ క్రిష్ణయ్య, పోలినేని రమేష్, సీహెచ్. వెంకటాద్రి, శ్రీనివాసులు, జీ.రామమోహన్ తదితరులు ఉన్నారు.