కారును ఢీకొట్టిన లారీ.. త్రుటిలో తప్పిన ప్రమాదం

ABN , First Publish Date - 2022-10-07T05:10:55+05:30 IST

సంగం - ముంబై జాతీయ రహదారి కూడలిలో గురువారం వేగంగా వస్తున్న ఓ లారీ, కారును ఢీకొన్న సంఘటనలో త్రుటిలో ప్రమాదం తప్పింది.

కారును ఢీకొట్టిన లారీ.. త్రుటిలో తప్పిన ప్రమాదం
ప్రమాదానికి గురైన కారు

సంగం, అక్టోబరు 6: సంగం - ముంబై జాతీయ రహదారి కూడలిలో గురువారం వేగంగా వస్తున్న ఓ లారీ,  కారును ఢీకొన్న సంఘటనలో త్రుటిలో ప్రమాదం తప్పింది. వివరాల మేరకు.. ప్రొద్దుటూరుకు చెందిన వెంకటేష్‌ కుటుంబం కారులో నెల్లూరుకు వచ్చి తిరిగి వెళ్తుండగా.. మార్గమధ్యలో సంగం వద్ద ముంబై జాతీయ రహదారి కూడలిలో ఆత్మకూరు నుంచి నెల్లూరు వైపు వెళ్తున్న లారీ కొండ దిగువన వేగంగా వస్తూ ఎదురుగా వస్తున్న కారును ఢీకొట్టి కుడివైపు పొదల్లోకి దూసుకెళ్లింది. ఈ ప్రమాదంలో కారులోని బెలూన్లు బయటకు రావడంతో అందులో ప్రయాణిస్తున్నవారికి స్వల్ప గాయాలయ్యాయి. సమాచారం అందుకున్న ఎస్‌ఐ నాగార్జునరెడ్డి ఘటనా స్థలాన్ని పరిశీలించారు. అనంతరం గాయపడ్డ వారిని ఆటోలో వైద్యశాలకు తరలించారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

Read more