కారు ఢీకొని ఐదు గొర్రెలు మృతి

ABN , First Publish Date - 2022-08-17T03:37:06+05:30 IST

మండలంలోని బాట గ్రామం వద్ద రోడ్డు దాటుతున్న గొర్రెల మందను మంగళవారం సాయంత్రం కారు ఢీకొనడంతో ఐదు గొర్రె

కారు ఢీకొని ఐదు గొర్రెలు మృతి
రోడ్డుపై మృతి చెందిన గొర్రెలు

   

 మర్రిపాడు, ఆగస్టు 16 : మండలంలోని బాట గ్రామం వద్ద రోడ్డు దాటుతున్న గొర్రెల మందను  మంగళవారం సాయంత్రం  కారు ఢీకొనడంతో ఐదు గొర్రెలు అక్కడికక్కడే మృతి చెందాయి. మరో ఆరుగొర్రెలకు కాళ్లు విరిగి ప్రాణాపాయ స్థితిలో ఉన్నాయని సింగనపల్లెకు చెందిన గొర్రెల యజమాని భాస్కర్‌ ఆవేదన వ్యక్తం చేశాడు. గొర్రెలను ఢీకొన్న కారు ఆగకుండా వెళ్లింది. దీంతో కృష్ణాపురం వద్ద ఉన్న టోల్‌గేట్‌లో ఉన్న సీసీ కెమెరాల సాయంతో కర్నాటకకు చెందిన (కెఎ03 కెఎఫ్‌9747)కారుగా గుర్తించారు. అది బద్వేలు నుంచి దుత్తలూరు వైపు వెళ్లున్నట్లు గమనించారు. అనంతరం మర్రిపాడు పోలీసులకు సమాచారం అందించారు. ఈ ప్రమాదంతో తనకు లక్ష రూపాయల నష్టం వాటిల్లిందని భాస్కర్‌ పేర్కొన్నాడు.


Updated Date - 2022-08-17T03:37:06+05:30 IST