తల్లికి జార్ఖండ్‌ బాలల అప్పగింత

ABN , First Publish Date - 2022-09-18T05:29:17+05:30 IST

గూడూరు ప్రభుత్వ బాలల సంరక్షణ హోంలో ఆశ్రయం పొందుతున్న జార్ఖండ్‌ రాష్ర్టానికి చెందిన ఇద్దరు బాలురను ఐసీడీఎస్‌ పీడీ ఉమామహేశ్వరి శనివారం తన కార్యా లయంలో తల్లికి అప్పగించారు.

తల్లికి జార్ఖండ్‌ బాలల అప్పగింత
బాలలను తల్లికి అప్పగిస్తున్న పీడీ ఉమామహేశ్వరి, సిబ్బంది

నెల్లూరు ( వీఆర్సీ ) సెప్టెంబరు 17 : గూడూరు ప్రభుత్వ బాలల సంరక్షణ హోంలో ఆశ్రయం పొందుతున్న జార్ఖండ్‌ రాష్ర్టానికి చెందిన ఇద్దరు బాలురను ఐసీడీఎస్‌ పీడీ ఉమామహేశ్వరి శనివారం తన కార్యా లయంలో తల్లికి అప్పగించారు. వివరాలిలా ఉన్నాయి. జార్ఖండ్‌ రాష్ట్రానికి చెందిన దంపతులు కేరళలో తేయాకు తోటల్లో పనిచేసేవారు. వారు గొడవపడడంతో తండ్రి జీటా కండే తన ఇద్దరు మగ పిల్లలను (5, 3 సంవత్సరాలు ) తీసుకుని ఇటీవల కేరళ నుంచి బయలుదేరాడు.  గూడూరులో అతను తాగునీటి కోసం రైలు దిగగా ఆయన వెనుకనే పిల్లలు దిగారు. గమనించని తండ్రి రైలు ఎక్కి వెతకగా పిల్లలు కనిపిం చలేదు. దాంతో అతనుబిట్రగుంట రైల్వే స్టేషన్‌లో దిగి ఆందోళనకు దిగాడు. రెండురోజుల క్రితం కరెంటు స్తంభం ఎక్కి హల్‌చల్‌ చేసి గాయా లపాలై కావలి ఆసుపత్రిలో చికిత్సపొందుతున్నాడు. గూడూరు పోలీసులు ఆ బాలలను సంరక్షణ హోంకు తరలించారు. బాధితుడు ఇచ్చిన సమా చారం ఆధారంగా కేరళలోని పిల్లల తల్లిని శనివారం నెల్లూరు రప్పించారు. గూడూరు హోంలోని బాలలను తీసుకొచ్చి ఆమెకు అప్పగించారు. కావలిలో చికిత్స పొందుతున్న భర్త వద్దకు భార్యా పిల్లలను డీసీపీవో సురేష్‌ , సిబ్బంది దగ్గరుండి పంపించారు. పిల్లలను అక్కున చేర్చుకున్న తల్లి ఆనందంతో సిబ్బందికి ధన్యవాదాలు తెలిపారు. కార్యక్రమంలో గూడూరు ఎంఎస్‌కే శ్రీలలిత, మహిళా కానిస్టేబుల్‌ శిరీష  పాల్గొన్నారు. 

Read more