భవానీ కంకణ దీక్ష మాలాధారణ

ABN , First Publish Date - 2022-09-27T04:08:13+05:30 IST

మండలంలోని మొగిలిచెర్లలో ఉన్న దత్తాత్రేయ స్వామి ఆలయంలో అమ్మవారి నవరాత్రుల ప్రారంభం సందర్భంగా సోమవారం సుమారు 150 మంది భవానీ కంకణ దీక్ష మాలను ధరించారు.

భవానీ కంకణ దీక్ష మాలాధారణ
దత్తాత్రేయస్వామి ఆలయంలో భవానీ కంకణ దీక్ష ధరించిన భక్తులు

లింగసముద్రం, సెప్టెంబరు 26 : మండలంలోని మొగిలిచెర్లలో ఉన్న దత్తాత్రేయ స్వామి ఆలయంలో అమ్మవారి నవరాత్రుల ప్రారంభం సందర్భంగా సోమవారం సుమారు 150 మంది భవానీ కంకణ దీక్ష మాలను ధరించారు. ఆలయ వ్యవస్థాపక ధర్మకర్త పవని నాగేంద్రప్రసాద్‌ దంపతులు మాలాధారణ భక్తులను ఆశీర్వదించారు. నాగేంద్ర ప్రసాద్‌ మాట్లాడుతూ ఈ దీక్ష ధరించిన భక్తులు 11 రోజులు దీక్షలో ఉంటారని, విజయదశమి రాత్రి పండరీ భజన, అగ్నిగుండం ప్రవేశం చేసిన మరుసటి రోజు ఉదయం అమ్మవారి దీక్షను విరమిస్తారని చెప్పారు. అదేరోజు సాయంత్రం అమ్మవారి విగ్రహాన్ని మేళతాళాలతో ఊరేంగింపుగా తీసుకెళ్లి నదిలో నిమజ్జనం చేస్తారని తెలిపారు. ఈ 11 రోజులు దీక్షలో ఉన్న స్వాములకు దాతల సహకారంతో ప్రతి రోజూ రెండుపూట్ల భోజనం ఏర్పాటు చేస్తామన్నారు. 11వ రోజున వచ్చే వందలాది మంది భక్తులకు అన్నప్రసాద వితరణ చేస్తామన్నారు. దీక్షలో ఉన్న భక్తులకు ఉచితంగా ఆహారం అందజేస్తే దత్తాత్రేయస్వామి, దుర్గామాతల అనుగ్రహం ప్రాప్తిస్తుందని భక్తుల విశ్వాసం అన్నారు.

Read more