చర్చిల అక్రమ నిర్మాణాలు ఆపాలని వినతి

ABN , First Publish Date - 2022-10-18T03:20:57+05:30 IST

మండలంలో ప్రభుత్వ భూములను ఆక్రమించి సాగిస్తున్న చర్చిల నిర్మాణాలను వెంటనే ఆపాలని బీజేవైఎం, హిందూ ధర్మ పరి

చర్చిల అక్రమ నిర్మాణాలు ఆపాలని వినతి
తహసీల్దారుకు వినతిపత్రం అందజేస్తున్న బీజేవైఎం, హిందూ పరిరక్షణ సమితి నాయకులు

కలువాయి, అక్టోబరు 17: మండలంలో ప్రభుత్వ భూములను ఆక్రమించి సాగిస్తున్న చర్చిల నిర్మాణాలను వెంటనే ఆపాలని బీజేవైఎం, హిందూ ధర్మ పరిరక్షణ సమితి నాయకులు సోమవారం తహసీల్దారుకు వినతి పత్రం అందజేశారు. మండలంలోని పలు గ్రామాల్లో చర్చిల నిర్మాణం చేస్తున్నవారు ప్రభుత్వ అనుమతి తీసుకోకపోవడంతోపాటు,  నిబంధనలు పాటించడం లేదని వారు పేర్కొన్నారు. వారిపై చర్యలు తీసుకోవాలని కోరారు. ఈ కార్యక్రమంలో బీజేవైఎం నేతలు కారుమంచి నరేష్‌, రాఖీ, మన్మఽథ, మల్లికార్జున, రాణప్రతాప్‌, సురేష్‌, తదితరులు పాల్గొన్నారు. 


Updated Date - 2022-10-18T03:20:57+05:30 IST