అప్పుల ఊబిలో ఆంధ్రప్రదేశ్
ABN , First Publish Date - 2022-10-08T04:52:54+05:30 IST
వైసీపీ ప్రభుత్వం అన్ని రంగాల్లో వైఫల్యం చెందడంతో పాటు ఆంధ్రప్రదేశ్‌ను అప్పుల ఊబిలోకి నెట్టిందని జనసేన పార్టీ నియోజకవర్గ ఇన్‌చార్జ్ నలిశెట్టి శ్రీధర్ తెలిపారు.
వైసీపీ ప్రభుత్వం అన్ని రంగాల్లో వైఫల్యం
జనసేన నియోజకవర్గ ఇన్‌చార్జ్ నలిశెట్టి శ్రీధర్
ఆత్మకూరు, అక్టోబరు 7 : వైసీపీ ప్రభుత్వం అన్ని రంగాల్లో వైఫల్యం చెందడంతో పాటు ఆంధ్రప్రదేశ్‌ను అప్పుల ఊబిలోకి నెట్టిందని జనసేన పార్టీ నియోజకవర్గ ఇన్‌చార్జ్ నలిశెట్టి శ్రీధర్ తెలిపారు. ‘పవనన్న ప్రజాబాట’ కార్యక్రమంలో భాగంగా శుక్రవారం ఆత్మకూరు మున్సిపాల్టీ పరిధిలోని ఎస్టీ కాలనీలో పర్యటించి ప్రజలను సమస్యలు అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లడుతూ వికేంద్రీకరణ పేరుతో ఆంధ్రప్రదేశ్‌కు రాజధాని లేని రాష్ట్రంగా చేశారని విమర్శించారు. ప్రభుత్వ ఉద్యోగుల పీఆర్సీ మోసం, సీపీఎస్ రద్దులేదు, పేద, మధ్యతరగతి కుటుంబాలకు కూడా కరెంటు బిల్లుల మోత.. ఇలా అన్నివిధాల అడుగడుగున ప్రభుత్వ వైఫల్యాలు గోచరిస్తున్నాయని పేర్కొన్నారు. ఆత్మకూరులో పరిశ్రమల స్థాపనకు పోరాడి నిరుద్యోగ యువతకు ఉపాధి కల్పించేందుకు కృషి చేస్తామన్నారు. కార్యక్రమంలో జనసేన నాయకులు సురేంద్ర, వంశీ, చంద్ర, పవన్, చైతన్య, శ్రీహరి తదితరులు పాల్గొన్నారు.