ప్రభుత్వ భూముల ఆక్రమణలను అడ్డుకోండి

ABN , First Publish Date - 2022-01-25T04:30:10+05:30 IST

నెల్లూరురూరల్‌ ప్రాంతంలోని కోడూరుపాడు వద్ద ఉన్న ప్రభుత్వ భూమిలో అనధికారికంగా వేస్తున్న లే అవుట్‌లను వెంటనే అడ్డుకోవాలని, భూ ఆక్రమణకు పాల్పడిన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని వైసీపీ రాష్ట్ర కార్యదర్శి, డీసీసీబీ మాజీ చైర్మన్‌ ఆనం విజయకుమార్‌రెడ్డి అధికారులను కోరారు.

ప్రభుత్వ భూముల ఆక్రమణలను అడ్డుకోండి
ఆర్డీవో కార్యాలయం వద్ద మాట్లాడుతున్న ఆనం విజయకుమార్‌రెడ్డి

కోడూరుపాడులో 30 ఎకరాలు కబ్జా

అధికారులకు ఆనం విజయకుమర్‌రెడ్డి ఫిర్యాదు

నెల్లూరు(వెంకటేశ్వరపురం), జనవరి 24: నెల్లూరురూరల్‌ ప్రాంతంలోని కోడూరుపాడు వద్ద ఉన్న ప్రభుత్వ భూమిలో అనధికారికంగా వేస్తున్న లే అవుట్‌లను వెంటనే అడ్డుకోవాలని, భూ ఆక్రమణకు పాల్పడిన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని వైసీపీ రాష్ట్ర కార్యదర్శి, డీసీసీబీ మాజీ చైర్మన్‌ ఆనం విజయకుమార్‌రెడ్డి అధికారులను కోరారు.  ఈ మేరకు సోమవారం గ్రామస్థులతో కలసి నెల్లూరు ఆర్డీవో కార్యాలయంలో ఫిర్యాదు చేస్తూ కార్యాలయ సూపరింటెండెంట్‌ మధుసూదనశర్మకు వినతిపత్రం అందజేశారు. లాగే జల్లా పోలీసు యంత్రాగానికి, ఇరిగేషన్‌, రెవెన్యూ అధికారుల దృష్టికి ఆక్రమణల విషయాన్ని తీసుకెళ్లారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ దాదాపు 30 ఎకరాల ప్రభుత్వ భూమిని ఆక్రమించి పేదలకు విక్రయిస్తున్నారని ఆరోపించారు. సంబంధిత అధికారులు పరిశీలించి చర్యలు చేపట్టాలని కోరారు. 

Updated Date - 2022-01-25T04:30:10+05:30 IST