అంబేడ్కర్‌కు ఘన నివాళి

ABN , First Publish Date - 2022-12-07T00:09:02+05:30 IST

ఆత్మకూరులో పలుచోట్ల అంబేడ్కర్‌ వర్ధంతిని ఘనంగా నిర్వహించారు.

అంబేడ్కర్‌కు ఘన నివాళి
ఆత్మకూరులోని అంబేడ్కర్‌ విగ్రహం వద్ద నివాళ్లులర్పిస్తున్న మున్సిపల్‌ కౌన్సిలర్లు, వైసీపీ నేతలు

ఆత్మకూరు, డిసెంబరు 6 : ఆత్మకూరులో పలుచోట్ల అంబేడ్కర్‌ వర్ధంతిని ఘనంగా నిర్వహించారు. మంగళవారం పట్టణంలోని అంబేద్కర్‌ విగ్రహానికి దళిత సంఘాలు, ఉద్యోగ, ఉపాధ్యాయ, కార్మిక సంఘాలు, పలు పార్టీల నేతలు పూలమాలలు వేసి నివాళ్లులర్పించారు. మున్సిపల్‌ చైర్‌పర్సన్‌ జి వెంకటరమణమ్మ, వైస్‌చైర్మన్‌ షేక్‌ సర్ధార్‌, సిండికేట్‌ ఫార్మర్స్‌ సొసైటీ చైర్మన్‌ నాగులపాటి ప్రతాప్‌రెడ్డి, కౌన్సిలర్లు, వైసీపీ నేతలు అంబేడ్కర్‌ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. అలాగే సీపీఎం నేతలు ఆత్మకూరు నాగయ్య, కె డేవిడ్‌రాజు, నాగేంద్ర, రైతు సంఘం మండల కార్యదర్శి లక్కు కృష్ణప్రసాద్‌ అంబేద్కర్‌ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. బీఎస్పీ ఆధ్వర్యంలో బస్టాండ్‌ సెంటర్‌లో వర్ధంతి సభ నిర్వహించారు. కార్యక్రమంలో నియోజకవర్గ ఇన్‌చార్జ్‌ నందా ఓబులేశు, ప్రధాన కార్యదర్శి టి కృష్ణ పాల్గొన్నారు. కాగా పోలీస్‌స్టేషన్‌లో ఎస్‌ఐ సాయిప్రసాద్‌, సిబ్బంది, తహసీల్దారు, ఎంపీడీవో కార్యాలయాల్లో ఎమ్మార్వో పీఎల్‌ లక్ష్మీనరసింహం, సీ.శ్రీనివాసులు, రెవెన్యూ సిబ్బంది అంబేడ్కర్‌ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు.

సంగం : డాక్టర్‌ బీఆర్‌ అంబేడ్కర్‌ 66వ వర్థంతిని పురస్కరించుకుని బహుజన సమాజ్‌ పార్టీ ప్రధాన కార్యదర్శి టి కృష,్ణ అన్వర్‌ బాషా ఆధ్వర్యంలో ఘనంగా వేడుకలు నిర్వహించారు. ఈ సందర్భంగా మంగళవారం స్థానిక తహసీల్దారు కార్యాలయం వెలుపల ఉన్న అంబేడ్కర్‌ విగ్రహానికి పూలమాల వేసి నివాళ్లులర్పించారు. కార్యక్రమంలో దళిత నాయకుడు గంటా పెంచలయ్య, దారా చిన పెంచలయ్య, తిరుపతి, కొండయ్య, వెంకటేశ్వర్లు తదితరులు పాల్గొన్నారు.

అనంతసాగరం: సోమశిల, అనంతసాగరం గ్రామాల్లో మంగళవారం అంబేడ్కర్‌ వర్ధంతిని నిర్వహించారు. ఈ సందర్భంగా అంబేడ్కర్‌ విగ్రహాలకు పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. అనంతరం ఆయన దేశానికి చేసిన సేవలు కొనియాడారు. కార్యక్రమంలో సీఐటీయూ నాయకులు అన్వర్‌బాషా, విజయ్‌, పీ సుందరం, ఉద్యోగ సంఘం నాయకులు చంద్రశేఖర్‌,, రామకృష్ణ, పెంచలయ్య పాల్గొన్నారు. అలాగే స్థానిక గ్రంథాలయంలో అంబేడ్కర్‌ చిత్రపటానికి పూలమాలు వేసి నివాళ్లులర్పించారు. కార్యక్రమంలో గ్రంథ పాలకుడు నారాయణరావు, సచివాలయ ఉద్యోగి మురళి, ఉపాధ్యాయులు మాబు, రవి, పాఠ కులు పాల్గొన్నారు.

Updated Date - 2022-12-07T00:09:37+05:30 IST