అక్రమ అరెస్టులతో ఉద్యమాలు అపలేరు!

ABN , First Publish Date - 2022-01-21T03:37:21+05:30 IST

న్యాయమైన సమస్యల పరిష్కారం కోసం చలో కలెక్టరేట్‌ కార్యక్రమానికి వెళుతున్న ఉద్యోగులను కాపుకాచి నిర్బంధించడం ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేసినట్టేనని ఫ్యాప్టో, కాంట్రాక్టు ఉద్యోగులు హెచ్చరించారు.

అక్రమ అరెస్టులతో ఉద్యమాలు అపలేరు!
చిట్టేడు గురుకులం ఎదుట నినాదాలు చేస్తున్న కాంట్రాక్టు, అవుట్‌సోరింగ్‌ ఉద్యోగులు

 ఫ్యాప్టో, కాంట్రాక్టు ఉద్యోగుల ఆందోళన

కోట, జనవరి 20: న్యాయమైన సమస్యల పరిష్కారం కోసం చలో కలెక్టరేట్‌ కార్యక్రమానికి వెళుతున్న ఉద్యోగులను కాపుకాచి నిర్బంధించడం ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేసినట్టేనని ఫ్యాప్టో, కాంట్రాక్టు ఉద్యోగులు హెచ్చరించారు. గురువారం కోట పోలీస్‌స్టేషన్‌  ఎదుట  ఫ్యాప్టో ప్రతినిధులు, చిట్టేడు గురుకులం వద్ద అవుట్‌సోర్సింగ్‌, కాంట్రాక్టు ఉద్యోగులు ఆందోళన చేశారు.   నెల్లూరుకు వెళ్లేందుకు సిద్ధంగా ఉన్న కోట, వాకాడు, చిట్టమూరు మండలాలకు చెందిన ఫ్యాప్టో ప్రతినిధులను ఎస్‌ఐ పుల్లారావు  పోలీస్‌స్టేషన్‌కు తీసుకువెళ్లి, కొన్ని గంటలపాటు నిర్బంధించారు. 

వెంకటగిరి :కలెక్టరేట్‌ ముట్టడి కార్యక్రమానికి వెళుతున్న ఉపాధ్యాయ సంఘం నాయకులను పోలీసులు అరెస్టు చేశారు. దీంతో మిగిలిన ఉపాధ్యాయులు పోలీసుస్టేషన్‌ ఎదుట నిరసన తెలిపారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ అక్రమ అరెస్టులతో ఉద్యమాన్ని అడ్డుకోవడం ప్రభుత్వం వల్ల కాదన్నారు.  11వ పీఆర్సీని రద్దు చేయకుండటే ఆందోళనను ఉధృతం చేస్తామని హెచ్చరించారు. ఉపాధ్యాయ సంఘాల అరెస్టును ఎన్‌జీవో సంఘం నాయకుడు దుప్పుటి ఫణీంద్ర తీవ్రంగా ఖండించారు. 

మార్కెటింగ్‌ కమిటీ సిబ్బంది నిర సన..

 ఏఎంసీ కార్యాలయం వద్ద సిబ్బంది నల్లబ్యాడ్జిలు ధరించి నిరసన తెలిపారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ప్రభుత్వం ప్రకటించిన వేతన సవరణ జీవోతో తమకు తీరని అన్యాయం కలుగుతుందన్నారు. వెంటనే ఆ జీవోలు రద్దు చేయాలని డిమాండ్‌ చేశారు. ఈ సందర్భంగా నల్లబ్యాడ్జిలు ధరించి విధులకు హాజరయ్యారు. ఈ కార్యక్రమంలో కె సుబ్బారావు, ఎం కల్పన, మస్తానయ్య, శ్రీధర్‌, మాల్యాద్రి, శ్రీకాంత్‌, రియాజ్‌ తదితరులు పాల్గొన్నారు.




Updated Date - 2022-01-21T03:37:21+05:30 IST