ఉత్సాహంగా..

ABN , First Publish Date - 2022-09-18T05:21:27+05:30 IST

నగరంలోని ఏసీ సుబ్బారెడ్డి స్పోర్ట్స్‌ కాంప్లెక్స్‌లో జరుగుతున్న అగ్నివీర్‌ ఆర్మీ రిక్రూట్‌మెంట్‌ ర్యాలీకి యువత పెద్ద ఎత్తున హాజరవుతోంది.

ఉత్సాహంగా..
అభ్యర్థులకు నిర్వహిస్తున్న దేహదారుఢ్య పోటీలు

అగ్నివీర్‌ ఎంపికలకు విశేష స్పందన


నెల్లూరు (విద్య), సెప్టెంబరు 17 : నగరంలోని ఏసీ సుబ్బారెడ్డి స్పోర్ట్స్‌ కాంప్లెక్స్‌లో జరుగుతున్న అగ్నివీర్‌ ఆర్మీ రిక్రూట్‌మెంట్‌ ర్యాలీకి యువత పెద్ద ఎత్తున హాజరవుతోంది. మూడవ రోజు శనివారం భారీగా అభ్యర్థులు తరలిరావడంతో స్టేడియం పరిసరాలు సందడిగా మారాయి. ఈ నెల 26వ తేదీ వరకే జరిగే ఈ ఎంపికల ప్రక్రియకు దాదాపు 34వేల మంది అభ్యర్థులు హాజరవుతుండగా వీరిలో రోజుకు ఒక్కో జిల్లా నుంచి దాదాపు మూడువేల మంది అభ్యర్థులను ఎంపిక చేస్తున్నారు. తొలిరోజున చిత్తూరు జిల్లా, రెండోరోజు కర్నూలు జిల్లా అభ్యర్థులకు, శనివారం బాపట్ల జిల్లా అభ్యర్థులకు ఎంపికలు జరిగాయి. రోజుకు 3 వేలమందికి చొప్పున వివిధ రకాలు పరీక్షలు నిర్వహిస్తున్నారు. ఈ ఎంపికల ప్రక్రియను గుంటూరు ఆర్మీ రిక్రూట్‌మెంట్‌ అధికారి కల్నల్‌ కోహ్లీ, ఆర్మీ రిక్రూట్‌మెంట్‌ డైరెక్టర్లు, కల్నల్‌ దీపక్‌కుమార్‌, కల్నల్‌ వినయ్‌కుమార్‌, కల్నల్‌ సుమయ, సిబ్బంది పర్యవేక్షించారు. 


Read more