అధికారులను నిలదీయండి

ABN , First Publish Date - 2022-03-06T03:40:23+05:30 IST

గ్రామాల్లో నెలకొన్న సమస్యలపై అధికారులను నిలదీయాలని ఎమ్మెల్యే ఆనం రామనారాయణ రెడ్డి సర్పంచులు, ప్రజలకు సూచించారు

అధికారులను నిలదీయండి
మాట్లాడుతున్న ఎమ్మెల్యే ఆనం

ఎమ్మెల్యే ఆనం 

వెంకటగిరి(టౌన్‌), మార్చి 5: గ్రామాల్లో నెలకొన్న సమస్యలపై అధికారులను నిలదీయాలని ఎమ్మెల్యే ఆనం రామనారాయణ రెడ్డి సర్పంచులు, ప్రజలకు సూచించారు. శనివారం స్థానిక ఎంపీడీవో కార్యాలయంలో నిర్వహించిన మండల సర్వసభ్య సమావేశంలో ఆయన మాట్లాడారు.  వేసవిలో నియోజకవర్గంలో తాగునీటి ఎద్దడి కనిపించకూడదన్నారు. సర్పంచులు ప్రజలకు అందుబాటు ఉండాలని కోరారు. ఎంపీపీ, సర్పంచులు, జడ్పీటీసీ సభ్యులు సమష్టిగా అభివృద్ధికి కృషి చేయాలన్నారు. అనంతరం  508 మంది చిరువ్యాపారులకు జగనన్న తోడు పథకం కింద రూ. 50.80 లక్షల విలువైన చెక్కును ఏపీఎం జమునారాణి ఆధ్వర్యంలో అందజేశారు. ఎంపీపీ తంబిరెడ్డి తనూజ, జడ్పీటీసీ సభ్యుడు కోలా వెంకటేశ్వర్లు, ఎంపీడీవో కే. వెంకటేశ్వరరావు, వెంకటరత్నం రాజు తదితరులు పాల్గొన్నారు. 

చేనేత యంత్రాల పంపిణీ

 స్థానిక మున్సిపల్‌ కార్యాలయంలో 173 మంది చేనేత కార్మికులకు మోటరైజ్డ్‌ లిఫ్టింగ్‌ యంత్రాను ఎమ్మెల్యే పంపిణీ చేశారు. కేంద్ర ప్రభుత్వం 90శాతం సబ్సిడీతో  వీటిని అందించిందన్నారు. పట్టణంలోని కృష్ణమందిరం వద్ద వెంకటగిరి లారీ అసోషియేషన్‌ కార్యాలయాన్ని ప్రారంభించారు. లారీ అసోషియేషన్‌ అధ్యక్షుడు ఎల్‌. కోటీశ్వరరావును అభినందించారు. 

Read more