విద్యారంగ సమస్యలపై ఏబీవీపీ నిరసన

ABN , First Publish Date - 2022-11-28T21:45:24+05:30 IST

: విద్యారంగ సమస్యలను పరిష్కరించాలని కోరుతూ సోమవారం ఏబీవీపీ ఆధ్వర్యంలో సోమశిల రోడ్డు సెంటర్‌లో బైఠాయించి నిరసన వ్యక్తం చేశారు. దీంతో ట్రాఫిక్‌ స్తంభించింది.

విద్యారంగ సమస్యలపై ఏబీవీపీ నిరసన
నిరసన వ్యక్తం చేస్తున్న ఏబీవీపీ నేతలు, కార్యకర్తలు

ఆత్మకూరు, నవంబరు 28 : విద్యారంగ సమస్యలను పరిష్కరించాలని కోరుతూ సోమవారం ఏబీవీపీ ఆధ్వర్యంలో సోమశిల రోడ్డు సెంటర్‌లో బైఠాయించి నిరసన వ్యక్తం చేశారు. దీంతో ట్రాఫిక్‌ స్తంభించింది. పోలీసులు రంగ ప్రవేశంచేసి ఏబీవీపీ నేతలను తరలించేందుకు ప్రయత్నించారు. దాంతో స్వల్ప ఉద్రిక్తత నెలకొంది. ఈ సందర్భంగా ఏబీవీపీ జిల్లా కన్వీనర్‌ ఎం. అశోక్‌రెడ్డి మాట్లాడుతూ ప్రభుత్వం విద్యాదీవెన, వసతి దీవెన సకాలంలో విడుదల చేయకుండా విద్యార్థులను ఇబ్బందులకు గురిచేస్తున్నదని తెలిపారు. జీవో నెం 77ను రద్దు చేసి పీజీ విద్యార్ధులకు సైతం ఫీజు రియింబర్సుమెంట్‌ వర్తించేలా చర్యలు చేపట్టాలని డిమాండ్‌ చేశారు. ప్రభుత్వ పాఠశాలలు, కళాశాలల్లో మౌలిక వసతులు కల్పించి, టీచింగ్‌, నాన్‌ టీచింగ్‌ పోస్టులు భర్తీ చేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో నాయకులు రవికుమార్‌, ప్రవీణ్‌, భరత్‌, వెంకటేష్‌, వినయ్‌ తదితరులు పాల్గొన్నారు.

----------------------

Updated Date - 2022-11-28T21:45:25+05:30 IST