ఆరోగ్యం పట్ల శ్రద్ధ ముఖ్యం

ABN , First Publish Date - 2022-09-25T03:17:46+05:30 IST

ద్యార్థులు ఆరోగ్యం పట్ల శ్రద్ధ వహించాలని చేజర్ల పీఎచ్‌సీ వైద్యాధికారి డాక్టర్‌ ప్రమీలారాజకుమారి పేర్కొన్నారు. శనివారం

ఆరోగ్యం పట్ల శ్రద్ధ ముఖ్యం
మాట్లాడుతున్న డాక్టర్‌ ప్రమీలారాజకుమారి

చేజర్ల, సెప్టెంబరు24: విద్యార్థులు ఆరోగ్యం పట్ల శ్రద్ధ వహించాలని చేజర్ల పీఎచ్‌సీ వైద్యాధికారి డాక్టర్‌ ప్రమీలారాజకుమారి పేర్కొన్నారు. శనివారం స్థానిక ప్రభుత్వ జూనియర్‌ కళాశాలలో ఎన్‌ఎస్‌ఎస్‌ డేను ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా కళాశాలలోని అధ్యాపకులతోపాటు విద్యార్థులకు వివిధ రకాల వైద్య పరీక్షలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఇనచార్జి ప్రిన్సిపాల్‌ టీ శ్రీధర్‌, ఎన్‌ఎస్‌ఎస్‌ ప్రోగ్రాం ఆఫీసర్‌ ఎస్‌.ప్రసాద్‌,  వైద్య ఆరోగ్య సిబ్బంది పాల్గొన్నారు.

Read more