ఆలయాల్లో జెండా ఆవిష్కరణ

ABN , First Publish Date - 2022-08-14T03:02:10+05:30 IST

ఆజాదీకా అమృత్‌ మహోత్సవ్‌లో భాగంగా ఉదయగిరి మండలంలోని పలు ఆలయాల్లో శనివారం జాతీయ పతాకాలు రెపరె

ఆలయాల్లో జెండా ఆవిష్కరణ
ఉదయగిరి ఆలయంలో జెండాను ఆవిష్కరించిన ఎమ్మెల్యే మేకపాటి

ఉదయగిరి ఆగస్టు 13: ఆజాదీకా అమృత్‌ మహోత్సవ్‌లో భాగంగా ఉదయగిరి మండలంలోని పలు ఆలయాల్లో శనివారం జాతీయ పతాకాలు రెపరెపలాడాయి. స్ధానిక ఆనకట్ట వద్ద ఉన్న కల్యాణ మండపంలో విద్యార్థులకు చిత్రలేఖనం పోటీలను నిర్వహించారు. వివిధ వేషధారణలో ఉన్న చిన్నారులను ఎమ్మెల్యే మేకపాటి చంద్రశేఖర్‌రెడ్డి అభినందించారు. అనంతరం ఆయన జెండాను ఆవిష్కరించారు. కార్యక్రమంలో వైసీపీ  మండల కన్వీనర్‌ అక్కి భాస్కర్‌రెడ్డి, సర్పంచులు గౌసుమెద్దీన్‌, కే భాస్కర్‌రెడ్డి, ఉప సర్పంచు ముర్తుజా, ఎంపీడీవో ఐజాక్‌ ప్రవీణ్‌, ఎంఈవో మస్తాన్‌వలి తదితరులు పాల్గొన్నారు.


 గండిపాలెంలో..


ఉదయగిరి రూరల్‌, ఆగస్టు 13:  మండలంలోని గండిపాలెం గురుకుల పాఠశాల విద్యార్థులు శనివారం దేశ నాయకుల వేషధారణలో గ్రామ పురవీధుల్లో ర్యాలీ చేపట్టారు. ఈ సందర్భంగా బస్టాండ్‌ సెంటర్‌లో మానవహారం ఏర్పాటు చేసి, స్వాతంత్య్ర సమరయోధుల సేవలను స్మరించుకొన్నారు. ఈ సందర్భంగా విద్యార్థులు విన్యాసాలతో జాతీయ జెండాను ప్రదర్శించడం పలువుర్ని అకట్టుకుంది. ఈ కార్యక్రమంలో ప్రిన్సిపాల్‌ జీ.మురళీకృష్ణ, గ్రామ పెద్దలు, ఉపాధ్యాయులు తదితరులు పాల్గొన్నారు. కావలిలో..


కావలిటౌన్‌ : స్థానిక ఆర్టీసీ డిపోలో శనివారం డీఎం రాపూరు శ్రీనివాసులు ఆధ్వర్యంలో ఘర్‌ ఘర్‌ తిరంగా  వేడుకలు  జరిగాయి. డిపోలోని పలు విభాగాల్లో జెండా ఆవిష్కరించగా, పరిపాలనా భవనంపై డీఎం జెండా ఎగురవేశారు. కార్యక్రమంలో అసిస్టెంట్‌ మేనేజర్‌ బాబు, గ్యారేజ్‌ ఇన్‌చార్జి ఖాజామొహిద్దీన్‌, ఏవో విజయకుమారి, కార్గో ఇన్‌చార్జ్‌ రవిప్రకాష్‌ తదితరులు పాల్గొన్నారు.  కాగా జేబీ డిగ్రీ కళాశాలలోని డీఆర్‌ స్మారక స్తూపం వద్ద జెండా వేడుకలు జరిగాయి. ముఖ్య అతిధిగా విశ్రాంత ప్రిన్సిపాల్‌ రాజగోపాల్‌ రెడ్డి పాల్గొని జెండా ఎగురవేశారు. కార్యక్రమంలో ప్రిన్సిపాల్‌ నాయుడు, అధ్యాపకులు సిబ్బంది పాల్గొన్నారు.   Updated Date - 2022-08-14T03:02:10+05:30 IST