ఆధార్‌ మ్యాపింగ్‌తో డబుల్‌ ఎంట్రీలు తొలగించవచ్చు

ABN , First Publish Date - 2022-10-01T03:56:22+05:30 IST

ఆధార్‌ మ్యాపింగ్‌ ద్వారా డబుల్‌ ఎంట్రీ ఓట్లు తొలగించవచ్చని జడ్పీ సీఈవో చిరంజీవి తెలిపారు. శుక్రవారం బుచ్చి ఎంపీడీవో కార్యా

ఆధార్‌ మ్యాపింగ్‌తో డబుల్‌ ఎంట్రీలు తొలగించవచ్చు
మాట్లాడుతున్న జడ్పీ సీఈవో పక్కన తహసీల్దారు, ఎంపీడీవో

బుచ్చిరెడ్డిపాళెం,సెప్టెంబరు30: ఆధార్‌ మ్యాపింగ్‌ ద్వారా డబుల్‌ ఎంట్రీ ఓట్లు తొలగించవచ్చని జడ్పీ సీఈవో చిరంజీవి తెలిపారు. శుక్రవారం బుచ్చి ఎంపీడీవో కార్యాలయంలో   బీఎల్వోలతో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ బీఎల్వోలు వారం పదిరోజుల్లోపు ఆధార్‌ మ్యాపింగ్‌ పూర్తి చేయాలన్నారు. ఆధార్‌ మ్యాపింగ్‌ సమయంలో  ఓటర్‌తో సంతకాలు చేయించాలన్నారు.  కార్యక్రమంలో తహసీల్దారు ప్రమీల, ఎంపీడీవో నరసింహరావు తదితరులు పాల్గొన్నారు.


Read more