8 కేజీల గంజాయి పట్టివేత
ABN , First Publish Date - 2022-10-18T03:08:26+05:30 IST
మున్సిపాలిటీ పరిధిలోని నెల్లూరుపాళెం సమీపంలో ఎనిమిది కేజీల గంజాయిని సోమవారం సెబ్ అధికారి నయనతార, సిబ్బం
ఆత్మకూరు, అక్టోబరు 17: మున్సిపాలిటీ పరిధిలోని నెల్లూరుపాళెం సమీపంలో ఎనిమిది కేజీల గంజాయిని సోమవారం సెబ్ అధికారి నయనతార, సిబ్బంది పట్టుకున్నారు. అనంతరం నయనతార విలేకరులతో మాట్లాడుతూ ఏఎస్‌పేట మండలం కొండమీదకొండూరుకి చెందిన వాకా భార్గవరెడ్డి గంజాయిని తీసుకెళుతుండగా అదుపులోకి తీసుకుని విచారించామని తెలిపారు. నిందితుడు అరకు సమీపంలోని పాడేరులో టీఎస్‌ఆర్ కంపెనీలో ప్రాజెక్టు మేనేజర్‌కు డ్రైవర్‌గా పనిచేస్తున్నట్లు పేర్కొన్నారు. ఇటీవల అతను తన స్వగ్రామానికి వస్తూ గంజాయిని తీసుకువచ్చాడని విచారణలో తేలిందన్నారు. అదే గ్రామానికి చెందిన కూరపాటి గిరిధర్‌రెడ్డి సైతం పాడేరులోనే సైట్ ఇంజనీరుగా పనిచేస్తుండడంతో అతను తనకు గంజాయి ఇచ్చాడని నిందితుడు తెలిపాడని ఆమె వివరించారు. భార్గవరెడ్డిపై కేసు నమోదు చేసి రిమాండ్‌కు పంపుతామని చెప్పారు.