‘సోమశిల’కు 7,057 క్యూసెక్కుల ఇన్ఫ్లో
ABN , First Publish Date - 2022-08-05T05:04:04+05:30 IST
సోమశిల జలాశయానికి ఎగువ నుంచి గురువారం 7,057 క్యూసెక్కుల వరద ప్రవాహం వస్తున్నట్లు అధికారులు తెలిపారు.
వరద మరింత పెరిగే అవకాశం
అనంతసాగరం, ఆగస్టు 4: సోమశిల జలాశయానికి ఎగువ నుంచి గురువారం 7,057 క్యూసెక్కుల వరద ప్రవాహం వస్తున్నట్లు అధికారులు తెలిపారు. దీంతో జలాశయంలో 59.409 టీఎంసీలు నిల్వ ఉండగా దిగువ పెన్నాడెల్టాకు 610, దక్షిణ కాలువకు 120 క్యూసెక్కులు సరఫరా చేస్తున్నారు. ప్రస్తుతం రాయలసీమ జిల్లాలో కురుస్తున్న వర్షాలతో పెన్నా ఉపనది కుందుకు వరద పోటెత్తుతోంది. దీంతో సోమశిలకు రానున్న రెండు రోజుల్లో ప్రవాహం పెరగవచ్చని ఇంజనీర్లు అంచనా వేస్తున్నారు.