23 ఉన్నత పాఠశాలలో ఒకేషనల్ విద్య
ABN , First Publish Date - 2022-03-08T03:54:57+05:30 IST
రాబోయే రోజుల్లో ఉన్నత పాఠశాలల్లోనూ ఒకేషనల్ విద్యను ప్రభుత్వం తీసుకు రానున్నదని జిల్లా సమగ్ర శిక్ష అభియాన్ జీసీ
మనుబోలు, మార్చి 7: రాబోయే రోజుల్లో ఉన్నత పాఠశాలల్లోనూ ఒకేషనల్ విద్యను ప్రభుత్వం తీసుకు రానున్నదని జిల్లా సమగ్ర శిక్ష అభియాన్ జీసీడీవో సుమలత తెలిపారు. స్థానిక ఉన్నత పాఠశాలలో సోమవారం నిర్వహిస్తున్న సైకోమెట్రిక్ పరీక్షను ఆమె పరిశీలించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ జిల్లాలో 23 పాఠశాలల్లో ఒకేషనల్ విద్య బోధన చేసేలా ఎంపిక చేశామన్నారు. విద్యార్ధులకు అవసరమైన ఒకేషనల్ ట్రేడ్లను ఎంపిక చేసేందుకే సైకో మెట్రిక్ పరీక్ష నిర్వహిస్తున్నామన్నారు.ఈ పాఠశాల ప్రధానోపాధ్యాయుడు డేవిడ్ పాల్గొన్నారు.