low pressure: కొనసాగుతున్న అల్పపీడనం.. ఏపీ వర్షాలు

ABN , First Publish Date - 2022-11-23T21:31:32+05:30 IST

దక్షిణ కోస్తా, దానికి ఆనుకుని ఉత్తర తమిళనాడు (North Tamil Nadu) పరిసరాల్లో ఉన్న తీవ్ర అల్పపీడనం బుధవారం ఉదయానికి బలహీనపడి అల్పపీడనంగా మారింది.

low pressure: కొనసాగుతున్న అల్పపీడనం.. ఏపీ వర్షాలు

విశాఖపట్నం: దక్షిణ కోస్తా, దానికి ఆనుకుని ఉత్తర తమిళనాడు (North Tamil Nadu) పరిసరాల్లో ఉన్న తీవ్ర అల్పపీడనం బుధవారం ఉదయానికి బలహీనపడి అల్పపీడనంగా మారింది. బుధవారం సాయంత్రానికి అదే ప్రాంతంలో అల్పపీడనంగా కొనసాగుతుందని వాతావరణ శాఖ తెలిపింది. దీని ప్రభావంతో దక్షిణ కోస్తా, రాయలసీమల్లో పలుచోట్ల వర్షాలు కురిశాయి. రానున్న 24 గంటల్లో కోస్తా, రాయలసీమల్లో అక్కడక్కడా వర్షాలు కురుస్తాయని పేర్కొంది. అల్పపీడనం (low pressure) ప్రభావంతో అనేకచోట్ల మేఘాలు ఆవరించడంతో రాత్రి ఉష్ణోగ్రతలు సాధారణం కంటే రెండు నుంచి మూడు డిగ్రీలు ఎక్కువగా నమోదయ్యాయి. ఆరోగ్యవరంలో 19.5 డిగ్రీల కనిష్ఠ ఉష్ణోగ్రత నమోదైంది.

Updated Date - 2022-11-23T21:31:33+05:30 IST