రోడ్డు ప్రమాదంలో యువకుడి మృతి

ABN , First Publish Date - 2022-03-05T05:51:05+05:30 IST

నంద్యాల తాలూకా పోలీసుస్టేషన్‌ పరిధిలోని అయ్యలూరు వద్ద జరిగిన రోడ్డు ప్రమాదంలో హితేష్‌ (25) మృతి చెందినట్లు తాలూకా ఎస్‌ఐ గంగయ్య యాదవ్‌ తెలిపారు.

రోడ్డు ప్రమాదంలో యువకుడి మృతి

నంద్యాల(నూనెపల్లె), మార్చి 4: నంద్యాల తాలూకా పోలీసుస్టేషన్‌ పరిధిలోని అయ్యలూరు వద్ద జరిగిన రోడ్డు ప్రమాదంలో హితేష్‌ (25) మృతి చెందినట్లు తాలూకా ఎస్‌ఐ గంగయ్య యాదవ్‌ తెలిపారు. కర్నూలుకు చెందిన శ్రీనివాసులు, అతని కుమారుడు హితేష్‌ కర్నూలులో వస్త్ర వ్యాపారం చేసేవారు. దుస్తులు కొనుగోలుకు విజయవాడకు వెళ్లి తిరిగి వస్తుండగా అయ్యలూరు వద్ద వీరు ప్రయాణిస్తున్న కారును ఎదురుగా వస్తున్న లారీ ఢీకొనడంతో ప్రమాదం చోటు చేసుకుంది. ఈ ప్రమాదంలో హితేష్‌ అక్కడికక్కడే మృతిచెందగా, శ్రీనివాసులుకు గాయాలయ్యాయి. తండ్రి ఫిర్యాదు మేరకు లారీ డ్రైవర్‌ సుధాకర్‌పై కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్‌ఐ గంగయ్యయాదవ్‌ తెలిపారు. Read more