వైసీపీ నిలువునా ముంచేసింది: టీడీపీ
ABN , First Publish Date - 2022-12-15T23:53:29+05:30 IST
మోసపూరిత వాగ్ధానాలతో అధికారంలోకి వచ్చిన వైసీపీ ప్రభుత్వం ప్రజలను నిలువునా ముంచేసిందని టీడీపీ రాష్ట్ర కార్యదర్శి వలసల రామకృష్ణ, యువ నాయకుడు ధర్మవరం గౌతమ్ రెడ్డి, మండల అధ్యక్షుడు శ్రీనివాసులు యాదవ్ అన్నారు.
డోన్, డిసెంబరు 15: మోసపూరిత వాగ్ధానాలతో అధికారంలోకి వచ్చిన వైసీపీ ప్రభుత్వం ప్రజలను నిలువునా ముంచేసిందని టీడీపీ రాష్ట్ర కార్యదర్శి వలసల రామకృష్ణ, యువ నాయకుడు ధర్మవరం గౌతమ్ రెడ్డి, మండల అధ్యక్షుడు శ్రీనివాసులు యాదవ్ అన్నారు. గురువారం సాయంత్రం మండలంలోని కొచ్చెర్వు గ్రామంలో టీడీపీ ఆధ్వర్యంలో ఇదేమి కర్మ మన రాష్ట్రానికి కార్యక్రమాన్ని నిర్వహించారు. జిల్లా కార్యదర్శి అభిరెడ్డిపల్లె గోవిందు, ఎస్‌టీ గుల్షన్, బబ్లూయాదవ్, కొచ్చెర్వు రామాంజినేయులు, నాగన్న, మధుసూదన్ రెడ్డి, నాయక్, మధు పాల్గొన్నారు.
నిత్యావసర ధరలు తగ్గాలంటే మళ్లీ చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి కావాలని టీడీపీ జిల్లా అధికార ప్రతినిధి విజయభట్టు, పట్టణ అధ్యక్షుడు సీఎం శ్రీనివాసులు, బీసీ సెల్ జిల్లా అధ్యక్షుడు ప్రజావైద్యశాల మల్లికార్జున అన్నారు. గురువారం సాయంత్రం పట్టణంలోని 12వ వార్డులో టీడీపీ ఆధ్వర్యంలో ఇదేం ఖర్మ మన రాష్ట్రానికి కార్యక్రమాన్ని నిర్వహించారు. కృష్ణప్రసాద్, అజీజ్, వలి, నబీ రసూల్, రవి, కేబుల్ కిరణ్, నీలం ప్రభాకర్, వినయ్ చౌదరి, ఆలిబాబా, లారీల భాషా, ఖాజా పాల్గొన్నారు.
ప్యాపిలి: టీడీపీ అధినేత చంద్రబాబునాయుడుతోనే రాష్ట్రానికి పూర్వవైభవం వస్తుందని టీడీపీ ప్యాపిలి మండల అధ్యక్షుడు గండికోట రామసుబ్బయ్య అన్నారు. గురువారం మండలంలోని నేరేడుచెర్ల, రాచెర్ల గ్రామాల్లో ఇదేం ఖర్మ మన రాష్ట్రానికి కార్యక్రమాన్ని నిర్వహించారు. ఆయన మాట్లాడుతూ మూడున్నరేళ్ల వైసీపీ పాలనలో రాష్ట్రం అధోగతి పాలైందన్నారు. ఉద్యోగ, ఉపాధ్యాయులకు కనీసం జీతాలు కూడా సకాలంలో చెల్లించలేని పరిస్థికి ప్రభుత్వం దిగజారి పోయిందన్నారు. వచ్చే ఎన్నికల్లో వైసీపీకి బుద్ది చెప్పకపోతే రాష్ట్ర పరిస్థితి దయనీయంగా మారుతుందన్నారు. నాయకులు ఆర్‌ఈ రాఘవేంద్ర, సుదర్శన్, సురేంద్రచౌదరి, శ్రీరాములు, రజనియాదవ్, లాల్‌రెడ్డి, రామక్రిష్ణ పాల్గొన్నారు.
బేతంచెర్ల: రాష్ట్రంలో వైసీపీ రాక్షస పాలనకు రోజులు దగ్గర పడ్డాయని టీడీపీ మండల కన్వీనర్ ఎల్లనాగయ్య అన్నారు. బేతంచెర్ల నగర పంచాయితీ పరిధిలోని బుగ్గానిపల్లె గ్రామంలో టీడీపీ ఆధ్వర్యంలో నిర్వహించిన ఇదేమి కర్మ మన రాష్ట్రానికి కార్యక్రమంలో ఆయన ముఖ్యఅతిథిగా పాల్గొన్నారు. బుగ్గానపల్లెలో ఇంటింటికి తిరుగుతూ ప్రజల సమస్యలను అడిగి తెలుసుకున్నారు. టీడీపీ సమన్వయకర్త చంద్రశేఖర్, షేక్షావలి చౌదరి, తిరుమలేష్ చౌదరి, సుధాకర్ చౌదరి, రాజేష్, రవీంద్ర నాయక్, వార్డు కౌన్సిలర్లు రామగోపాల్, రామాంజినేయులు, రామ్మూర్తి తదితరులు పాల్గొన్నారు.
బనగానపల్లె: మండలంలోని రామతీర్థం గ్రామంలో గురువారం ఇదేం ఖర్మ మన రాష్ట్రానికి కార్యక్రమాన్ని టీడీపీ నాయకులు నిర్వహించారు. గ్రామంలోని ఇంటింటికి తిరిగి కరపత్రాలు పంపిణీ చేసి సమస్యలు అడిగి తెలుసుకకున్నారు. బొబ్బలగోపాల్‌రెడ్డి, వల్లెపు శంకర్, రామతీర్థం మద్దిలేటి, రామయ్య, దస్తగిరి, శివుడు, క్లస్టర్ ఇంచార్జిలు, యూనిట్, సెక్సన్ ఇన్‌చార్జిలు పాల్గొన్నారు.
సంజామల: ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డితోనే రాష్ర్టానికి ఖర్మ పట్టిందని టీడీపీ మండల ఉపాధ్యక్షుడు బత్తుల ప్రతాప్ రెడ్డి, మల్కి హుసేన్ అన్నారు. గురువారం గిద్దలూరు, సంజామల గ్రామాల్లో ఇదేం ఖర్మ మన రాష్ర్టానికి కార్యక్రమాన్ని నిర్వహించారు. తోట శ్రీనివాస రెడ్డి, మద్దిలేటి, నాగేశ్వరరావు, సుబ్బారావు, రవి, సుబ్బరామక్రిష్ణయ్య, మాధవ, సుబ్బయ్య పాల్గొన్నారు.