‘కార్మికులు పోరాటాలకు సిద్ధం కావాలి’

ABN , First Publish Date - 2022-12-31T01:02:54+05:30 IST

కార్మికుల హక్కులు సాధించు కునేందుకు పోరాటాలకు సిద్ధం కావాలని సీఐటీయూ రాష్ట్ర ఉపాధ్యక్షురాలు స్వరూపారాణి పిలుపునిచ్చారు.

‘కార్మికులు పోరాటాలకు సిద్ధం కావాలి’

కర్నూలు(న్యూసిటీ), డిసెంబరు 30: కార్మికుల హక్కులు సాధించు కునేందుకు పోరాటాలకు సిద్ధం కావాలని సీఐటీయూ రాష్ట్ర ఉపాధ్యక్షురాలు స్వరూపారాణి పిలుపునిచ్చారు. జనవరి 2 నుంచి 4 వరకు భీమవరంలో జరిగే సీఐటీయూ రాష్ట్ర మహాసభలను విజయవంతం చేయాలని కోరుతూ హిందూ పురంలో ప్రారంభమైన జాతా శుక్రవారం నగరానికి చేరుకుంది. స్థానిక సుం దరయ్య కూడలిలో ఏర్పాటు చేసిన సభకు రాష్ట్ర కార్యదర్శి ఆర్‌వీ నరసిం గరావు, రాష్ట్ర ఉపాధ్యక్షుడు డి.గౌస్‌దేశాయ్‌ హాజరయ్యారు. ఈ సందర్భంగా స్వరూపారాణి మాట్లాడుతూ కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అనుసరిస్తున్న విఽధా నాల వల్ల కార్మికుల హక్కులు కోల్పోతున్నారన్నారు. రాష్ట్ర ప్రభుత్వం గత 15 సంవత్సరాలుగా కనీస వేతనాలు పెంచకుండ కార్మికులకు ద్రోహం చేసిందని విమర్శించారు. కార్యక్రమంలో రాష్ట్ర నాయకులు ఓబులు, జిల్లా అధ్యక్షుడు పీఎస్‌.రాధాక్రిష్ణ, ప్రధాన కార్యదర్శి ఎండీ అంజిబాబు, ఉపాధ్యక్షుడు రామాం జనేయులు, జిల్లా శ్రామిక మహిళా కన్వీనర్‌ పి.నిర్మల పాల్గొన్నారు.

Updated Date - 2022-12-31T01:02:57+05:30 IST