అమరవీరుల కుటుంబాలకు అండగా ఉంటాం
ABN , First Publish Date - 2022-10-08T04:26:52+05:30 IST
పోలీసు అమరవీరుల కుటుంబాలకు అండగా ఉంటామని ఎస్పీ సిద్ధార్థ కౌశల్ తెలిపారు.
- ఎస్పీ సిద్ధార్థ కౌశల్
- ఘనంగా పోలీసు సంక్షేమ దినోత్సవం
కర్నూలు, అక్టోబరు 7: పోలీసు అమరవీరుల కుటుంబాలకు అండగా ఉంటామని ఎస్పీ సిద్ధార్థ కౌశల్ తెలిపారు. పోలీసు అమరవీరుల వారోత్సవాల సందర్భంగా రాష్ట్ర డీజీపీ ఉత్తర్వుల మేరకు జిల్లా పోలీస్ కార్యాలయంలో శుక్రవారం పోలీస్ సంక్షేమ దినోత్సవ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ఎస్పీ సిద్ధ్దార్థ కౌశల్ హాజరయ్యారు. పదవి విరమణ, సాధారణ, కొవిడ్, అనారోగ్యం, ప్రమాదం ఇతర కారణాలతో మృతి చెందిన పోలీసు కుటుంబాలతో పోలీసు సంక్షేమ దినోత్సవ కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా ఎస్పీ మాట్లాడుతూ పోలీసు అమరవీరుల కుటుంబాలకు అండగా ఉంటామన్నారు. పోలీసుల సంక్షేమానికి జిల్లా పోలీసు శాఖ అన్ని రకాల చర్యలు తీసుకుంటుందన్నారు. పోలీసు కుటుంబాలకు రావాల్సిన బెనిఫిట్స్ త్వరితగతిన అందేలా చూస్తామన్నారు. ఫ్యామిలీ బెనిఫిట్స్, జీపీఎఫ్, లీవ్ నగదు, జీఐఎస్, పెండింగ్ బిల్స్, ఏపీజీఎల్‌ఐ, బీమా, భద్రత, పెన్షన తదితర బెనిఫిట్స్ పొందని వారు ఆయన దృష్టికి తీసుకెళ్లి సమస్యలను నేరుగా విన్నవించుకున్నారు. ఈ కార్యక్రమంలో అడిషనల్ ఎస్పీ అడ్మిన డి.ప్రసాద్, డీపీవో ఏవో సురేష్‌బాబు, పోలీస్ వెల్ఫేర్ హాస్పిటల్ డా.స్రవంతి, స్పెషల్ బ్రాంచ సీఐ లక్ష్మయ్య, ఆర్‌ఐ సురేంద్ర రెడ్డి, బాదిత పోలీసు కుటుంబాలు పాల్గొన్నారు.