నీరు లేని కాలువ
ABN , First Publish Date - 2022-01-18T05:21:39+05:30 IST
రుద్రవరం మండలం శ్రీరంగాపురం గ్రామ సమీపంలో 17వ బ్లాక్‌చానల్ నుంచి సబ్‌మైనర్ కాలువను 18 ఏళ్ల కింద తవ్వారు.

- 18 ఏళ్ల కింద తవ్వి వదిలేశారు..
రుద్రవరం, జనవరి 17: రుద్రవరం మండలం శ్రీరంగాపురం గ్రామ సమీపంలో 17వ బ్లాక్‌చానల్ నుంచి సబ్‌మైనర్ కాలువను 18 ఏళ్ల కింద తవ్వారు. ఈ కాలువ కింద సుమారు 150 ఎకరాలు ఆయకట్టు ఉంది. కానీ ఈ కాలువలో చుక్క నీరు పారడం లేదు. రైతులు ఏటా నీటి కోసం ఎదురు చూడటమేగాని నీరు రావడం లేదు. తెలుగు గంగ అధికారులకు రైతులు లెక్కలేనన్నిసార్లు ఫిర్యాదు చేశారు. అయినా సమస్య పరిష్కారం కాలేదు.
నీరు అందడం లేదు..
తెలుగుగంగ అధికారుల నిర్లక్ష్యం 17వ బ్లాక్‌చానల్ సబ్ మైనర్ కాలువ కింద ఆయకట్టు రైతులకు శాపంగా మారింది. మాకు 18 ఏళ్లుగా తెలుగుగంగ నీళ్లు అందడం లేదు.
- రామస్వామి, రైతు, శ్రీరంగాపురం
కాలువ ఉంది.. నీరు లేదు
శ్రీరంగాపురం గ్రామ సమీపంలో కాలువ కని పిస్తుంది. దీని వల్ల మాకు ఎలాంటి ఉపయోగం లేదు. అధికారులకు ఫిర్యాదు చేస్తే పట్టించుకోవడం లేదు.
- శేఖర్‌రెడ్డి, రైతు, శ్రీరంగాపురం