సన్మానానికి రాని వలంటరీలు

ABN , First Publish Date - 2022-04-24T05:52:25+05:30 IST

మండలంలో జరిగిన సన్మాన సభకు వలంటీర్లు హాజరు కాకపోవడంతో ఎమ్మెల్యే సుధాకర్‌ అధికారులపై ఆగ్రహం వ్యక్తం చేశారు.

సన్మానానికి రాని వలంటరీలు

  1. అధికారులపై అగ్రహం వ్యక్తం చేసిన ఎమ్మెల్యే


సి.బెళగల్‌, ఏప్రిల్‌ 23: మండలంలో జరిగిన సన్మాన సభకు వలంటీర్లు హాజరు కాకపోవడంతో ఎమ్మెల్యే సుధాకర్‌ అధికారులపై ఆగ్రహం వ్యక్తం చేశారు. శనివారం మండలంలోని సిబెళగల్‌ మండలంలోని కొత్తకోట, 12 మంది, ఈర్లదిన్నెలో 9 మంది, శింగవరంలో 6మంది, పోలకల్లులో 51 మంది మెత్తం 93 మంది వలంటరీలను సన్మానం చేయడానికి పోలకల్లు జడ్పీ ఉన్నత పాఠశాలలో ఏర్పాటు చేశారు. అయితే ఈ సభకు 15 మంది వలంటీర్లు మాత్రమే హాజరయ్యారు. సన్మాన సభకు హాజరు కాని వలంటీర్లకు గౌరవ వేతనం నిలుపుదల చేయాలని ఎమ్మెల్యే అధికారులను ఆదేశించారు.  


Read more