బారులు తీరిన వాహనాలు
ABN , First Publish Date - 2022-08-08T04:34:53+05:30 IST
ఉరుకుంద ఈరన్న దర్శనం కోసం ఆదివారం వాహనాలు బారులు తీరాయి.

కోసిగి, ఆగస్టు 7: ఉరుకుంద ఈరన్న దర్శనం కోసం ఆదివారం వాహనాలు బారులు తీరాయి. శ్రావణమాసం సందర్భంగా రెండో సోమవారం పురస్కరించుకుని ఒక్కరోజు ముందే కర్ణాటక, తెలంగాణ, ఇతర రాష్ట్రాల నుంచి వేలాది భక్తులు తరలివస్తున్నారు. కోసిగి రైల్వేగేటు నుండి మార్కెండేయస్వామి దేవాలయం వరకు ట్రాఫిక్ జామైంది. అలాగే దూర ప్రాంతాల నుంచి వచ్చిన భక్తులు ఇంటి నుంచి తెచ్చుకున్న ఆహారాన్ని పొలాల్లోనే భోజనం చేసి స్వామివారి దర్శనానికి వెళ్లారు.