త్వరలో యూనిఫాం కుట్టు కూలీ డబ్బులు జమ

ABN , First Publish Date - 2022-07-18T07:01:28+05:30 IST

ఉమ్మడి కర్నూలు, నంద్యాల జిల్లాల్లోని ప్రభుత్వ పాఠశాలల్లో 1 నుంచి 10వ తరగతి వరకు చదివే విద్యార్థులకు యూని ఫాం కుట్టు కూలీ డబ్బులు త్వరలో తల్లుల బ్యాంకు ఖాతాల్లో జమ చేయనున్నట్లు ఏపీ సమగ్ర శిక్ష కర్నూలు, నంద్యాల జిల్లాల ఏపీసీ డా.వేణుగోపాల్‌ ఆదివారం తెలిపారు.

త్వరలో యూనిఫాం కుట్టు కూలీ డబ్బులు జమ

కర్నూలు(ఎడ్యుకేషన్‌), జూలై 17: ఉమ్మడి కర్నూలు, నంద్యాల జిల్లాల్లోని ప్రభుత్వ పాఠశాలల్లో 1 నుంచి 10వ తరగతి వరకు చదివే విద్యార్థులకు యూని ఫాం కుట్టు కూలీ డబ్బులు త్వరలో తల్లుల బ్యాంకు ఖాతాల్లో జమ చేయనున్నట్లు ఏపీ సమగ్ర శిక్ష కర్నూలు, నంద్యాల జిల్లాల ఏపీసీ డా.వేణుగోపాల్‌ ఆదివారం తెలిపారు. రెండు జిల్లాల్లో విద్యార్థులు మొత్తం 4,72,844 మంది ఉన్నారన్నారు. వీరందరికీ జగనన్న విద్యాకానుక పేరుతో ప్రభుత్వం మూడు జతల యూనిఫాం సరఫరా చేసిందన్నారు. పెండింగ్‌లో ఉన్న కుట్టుకూలీల చార్జీలు త్వరలో చెల్లిస్తున్నట్లు రాష్ట్ర పథక సంచాలకులు ఉత్తర్వులు విడుదల చేసినట్లు ఆయన వివరించారు. 2021-22 విద్యాసంవత్సరానికిగాను మొత్తం  4,68,662 మంది విద్యార్థులు ఉన్నారన్నారు. 1 నుంచి 8వ తరగతి వరకు చదివే  3,90,659 మంది విద్యార్థులు తల్లుల ఖాతాల్లో ఒక్కొక్క విద్యార్థికి రూ.120ల చొప్పున మొత్తం రూ.46,87,908 జమ కానుందని వివ రించారు. అలాగే తొమ్మిది, పది తరగతులు చదివే 78,003 మంది విద్యార్థుల తల్లు ల బ్యాంకు ఖాతాల్లో ఒక్కొక్క విద్యార్థికి రూ.240ల చొప్పున మొత్తం రూ.18,72,07,202 జమ అవుతాయని తెలిపారు.

Updated Date - 2022-07-18T07:01:28+05:30 IST