‘పౌష్టికాహారంతో సంపూర్ణ ఆరోగ్యం’

ABN , First Publish Date - 2022-12-10T00:22:56+05:30 IST

పౌష్టికాహారంతో సంపూర్ణ ఆరోగ్యం లభిస్తుందని నంద్యాల జిల్లా వైద్యాధికారి వెంకటరమణ అన్నారు.

‘పౌష్టికాహారంతో సంపూర్ణ ఆరోగ్యం’
గర్భిణులను పరీక్షిస్తున్న డీఎంహెచ్‌వో డాక్టర్‌ వెంకటరమణ

కోవెలకుంట్ల, డిసెంబరు 9: పౌష్టికాహారంతో సంపూర్ణ ఆరోగ్యం లభిస్తుందని నంద్యాల జిల్లా వైద్యాధికారి వెంకటరమణ అన్నారు. శుక్రవారం రేవనూరు ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో ప్రధానమంత్రి సురక్షా మాతృత్వ అభియాన్‌ కార్యక్రమాన్ని నిర్వహించారు. జిల్లా వైద్యాధికారి ఆకస్మికంగా తనిఖీ చేశారు. డీఎంహెచ్‌వో గర్భిణులు, బాలింతలకు సకాలంలో వైద్య పరీక్షలు నిర్వహించి మందులు పంపిణీ చేయడమే కాకుండా పౌష్టికాహారం అందుతుందా లేదా అన్న దానిపై వారిని అడిగి తెలుసుకున్నారు. రికార్డులను పరిశీలించారు. కార్యక్రమంలో డాక్టర్‌ సుభహాని, మేరీ, మరియమ్మ, రాజశేఖర్‌, విద్య, ప్రభావతి వైద్య సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.

Updated Date - 2022-12-10T00:22:58+05:30 IST