ఇది రైతుల విజయం

ABN , First Publish Date - 2022-03-05T05:41:24+05:30 IST

ఆంధ్రప్రదేశ్‌ రాజధాని అమరావతే అని హైకోర్టు ప్రకటించడం రైతుల విజయం అని మాజీ ఎమ్మెల్యే బీసీ జనార్దన్‌రెడ్డి అన్నారు.

ఇది రైతుల విజయం

  1. హైకోర్టు తీర్పుపై మాజీ ఎమ్మెల్యే బీసీ జనార్దన్‌రెడ్డి 


బనగానపల్లె, మార్చి 4: ఆంధ్రప్రదేశ్‌  రాజధాని అమరావతే అని హైకోర్టు ప్రకటించడం రైతుల విజయం అని మాజీ ఎమ్మెల్యే బీసీ జనార్దన్‌రెడ్డి అన్నారు. శుక్రవారం టీడీపీ కార్యాలయంలో ఆయన విలేఖర్ల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా బీసీ మాట్లాడుతూ ఏపీ రాజధాని విషయంలో  అమరావతి రైతులకు న్యాయం జరిగిందన్నారు. రాజధాని రైతుల పోరాటాలు, శ్రమ వృథా కాలేదన్నారు. రాజధాని రైతుల పోరాటానికి తెలుగుదేశం పార్టీ సంపూర్ణ మద్దతు ఇచ్చిందన్నారు. భారతదేశంలో ఏ రాష్ట్రంలోనూ రాజధాని కోసం 34 వేల ఎకరాలు రైతులు ఉచితంగా ఇచ్చిన దాఖలాలు లేవన్నారు. మాజీ సీఎం చంద్రబాబునాయుడిపై నమ్మకంతో రైతులు  ప్రభుత్వానికి భూములు ఇచ్చారన్నారు. వైసీపీ అధికారంలోకి వచ్చిన తర్వాత రైతులకు అన్యాయం చేసిందన్నారు. రాజధాని రైతులను అన్ని విధాలా అణచివేసి, లాఠీచార్జీలు చేసి అమానుషంగా ప్రవర్తించారని అన్నారు. అయినా మొక్కవోని ధైర్యంతో దీక్షలు చేస్తూ న్యాయం కోసం హైకోర్టును ఆశ్రయించడంతో ఏపీ రాఽజధాని అమరావతి అని తీర్పు వచ్చిందని అన్నారు.  రాజధాని లేకపోవడంతో అనేక మంది ఉపాధి కోల్పోయారన్నారు.  నిరుద్యోగ సమస్య పెరిగిందన్నారు. ఇప్పటికైనా వైసీపీ ప్రభుత్వం న్యాయస్థానం తీర్పును మన్నించి   రాజధాని అభివృద్ధికి కృషి చేయాలని డిమాండ్‌ చేశారు. ఈ కార్యక్రమం లో మాజీ ఎంపీపీ అంబాల రామకృష్ణారెడ్డి, జిల్లా మైనార్టీ టీడీపీ అధ్యక్షుడు జాహిద్‌హుస్సేన్‌, వాణిజ్యవిభాగం సెల్‌, ఎస్టీ సెల్‌ నంద్యాల పార్లమెంట్‌ అధ్యక్షుడు టంగుటూరు శ్రీన య్య, కృష్ణానాయక్‌, పూల కలాం, పాతపాడు, మిట్టపల్లె సర్పంచ్‌లు బి.మహేశ్వరరెడ్డి, తులసిరెడ్డి, దొనపాటి భాస్కర్‌రెడ్డి, యాగంటిపల్లె సుధాకర్‌, గురప్ప పాల్గొన్నారు.




Updated Date - 2022-03-05T05:41:24+05:30 IST