అధికార మదంతో తలతిక్క పనులు

ABN , First Publish Date - 2022-09-24T05:47:25+05:30 IST

ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌ మోహన్‌ రెడ్డి అధికార మదంతో తలతిక్క పనులు చేస్తున్నారని తెలుగుదేశం పార్టీ జాతీయ ఉపాధ్యక్షుడు కోట్ల జయసూర్యప్రకాష్‌రెడ్డి అన్నారు.

అధికార మదంతో తలతిక్క పనులు

 తెలుగుదేశం పార్టీ జాతీయ ఉపాధ్యక్షుడు కోట్ల

కర్నూలు(అగ్రికల్చర్‌), సెప్టెంబరు 23: ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌ మోహన్‌ రెడ్డి అధికార మదంతో తలతిక్క పనులు చేస్తున్నారని తెలుగుదేశం పార్టీ జాతీయ ఉపాధ్యక్షుడు కోట్ల జయసూర్యప్రకాష్‌రెడ్డి అన్నారు. శుక్రవారం కర్నూలు నగరంలోని 3వ వార్డు బండిమెట్టలో అసెంబ్లీ నియోజకవర్గ పార్టీ ఇన్‌చార్జి టీజీ భరత్‌ ఆధ్వర్యంలో అన్న క్యాంటీన్‌ కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా కోట్ల మాట్లాడుతూ భస్మాసురుడిలా వైఎస్‌ జగన్‌ వ్యవహరిస్తున్నారని ధ్వజమెత్తారు. మూడున్నరేళ్లుగా రాష్ట్రంలో ఒక్క అంగుళం కూడా అభివృద్ధి జరగలేదని అన్నారు. ఎన్టీఆర్‌ హెల్త్‌ యూనివర్సిటీకి తన తండ్రి పేరు పెట్టుకోవడం ఏ మాత్రం సమంజసంగా లేదని, చేతనైతే మరో యూనివర్సిటీ ఏర్పాటు చేసి పేరు పెట్టుకోవాలని సూచించారు. ప్రజల మనోభావాలను దెబ్బతీయడం జగన్‌కు తగదని అభ్యంతరం వ్యక్తం చేశారు. అనంతరం టీజీ భరత్‌ మాట్లాడుతూ పేదల కడుపు నింపే గొప్ప కార్యక్రమం అన్న క్యాంటీన్‌ అన్నారు. అన్న క్యాంటీన్ల విలువ ఈ ప్రభుత్వానికి తెలియాలన్న ఉద్దేశంతోనే కర్నూలు నగరంలోని 33 వార్డుల్లో ప్రజలకు భోజనం అందించామని తెలిపారు. కార్యక్రమంలో వార్డు ఇన్‌చార్జి నాగ వీరాంజనేయులు, నాయకులు ఉమామహేశ్వరి, అర్జున్‌, నారాయణ, ఇమ్రాన్‌, విజయ్‌, నరేష్‌ తదితరులు పాల్గొన్నారు.

Read more