అవి ఫోర్టిఫైడ్‌ బియ్యం

ABN , First Publish Date - 2022-04-14T05:21:23+05:30 IST

కార్డుదారులకు పంపిణీ చేస్తున్నవి ప్లాస్టిక్‌ బియ్యం కాదని, ఫోర్టిఫైడ్‌వి అని జాయింట్‌ కలెక్టర్‌ రామసుందర్‌ రెడ్డి ఒక ప్రకటనలో విజ్ఞప్తి చేశారు.

అవి ఫోర్టిఫైడ్‌ బియ్యం

  1.   ప్లాస్టిక్‌వనే అపోహలు వద్దు 
  2. జాయింట్‌ కలెక్టర్‌ రాంసుందర్‌ రెడ్డి 

కర్నూలు(కలెక్టరేట్‌), ఏప్రిల్‌ 13: కార్డుదారులకు పంపిణీ చేస్తున్నవి ప్లాస్టిక్‌ బియ్యం కాదని, ఫోర్టిఫైడ్‌వి అని జాయింట్‌ కలెక్టర్‌ రామసుందర్‌ రెడ్డి ఒక ప్రకటనలో విజ్ఞప్తి చేశారు. ప్రజా పంపిణీ వ్యవస్థ ద్వారా కేంద్ర ప్రభుత్వం ఏప్రిల్‌ నుంచి ఎంపిక చేసిన ఐదు జిల్లాల్లో (కర్నూలు కూడా ఇందులో ఉన్నది) బలవర్ధకమైన ఫోర్టిఫైడ్‌ బియ్యం పంపిణీ చేయాలని ఉత్తర్వులు ఇచ్చిందని తెలిపారు. ఆ మేరకు వీటిని పంపిణీ చేస్తున్నామని చెప్పారు. అక్కడక్కడా తెల్లగా కనిపిస్తున్న బియ్యాన్ని చూపి ప్రజలు ప్లాస్టిక్‌ బియ్యమని అపోహపడుతున్నట్లు పలు దినపత్రికల్లో వార్తలు ప్రచురితం అవుతున్నాయన్నారు. అయితే అవి ప్లాస్టిక్‌ బియ్యం కాదని తెలిపారు. ఫోర్టిఫైడ్‌ బియ్యంలో రక్తహీనత నివారణకు ఐరన ఫోలిక్‌ ఆమ్లం, విటమిన-బీ 12 మొదలైన పోషకాలు ఉంటాయని వివరించారు. పత్రికలు, ప్రసార మాధ్యమాలు ప్రజలు అపోహలకు గురి కాకుండా అవగాహన కల్పించాలని జేసీ కోరారు. 


Updated Date - 2022-04-14T05:21:23+05:30 IST