ముగిసిన పార్వేట ఉత్సవం

ABN , First Publish Date - 2022-02-26T06:12:13+05:30 IST

అహోబిలేశుడి పార్వేట ఉత్సవం శుక్రవారం రాత్రితో ముగిసింది.

ముగిసిన పార్వేట ఉత్సవం
పార్వేట ఉత్సవ పల్లకిని మోస్తున్న బోయిలు

  1. 41 రోజుల్లో 33 గ్రామాల్లో 220 కిలోమీటర్లు..
  2. మార్చి 8 నుంచి అహోబిలేశుడి బ్రహ్మోత్సవాలు


రుద్రవరం, ఫిబ్రవరి 25: అహోబిలేశుడి పార్వేట ఉత్సవం శుక్రవారం రాత్రితో ముగిసింది. జ్వాలా లక్ష్మీనరసింహస్వామి, ప్రహ్లాద వరదస్వామి జనవరి 15వ తేదీ రాత్రి అహోబిలం దేవస్థానం నుంచి పల్లకిలో బయ లుదేరారు. 41 రోజుల పాటు 33 గ్రామాల్లో 220 కిలోమీటర్లు పర్యటిం చారు. గ్రామగ్రామాన పూజలు అందుకున్నారు. శుక్రవారం రాత్రి రుద్రవరంలో చివరి పూజలు అందుకున్నారు. శనివారం అహోబిలం చేరుకుంటారు. మార్చి 8 నుంచి అహోబిలంలో బ్రహ్మోత్సవాలు మొదల వుతాయి. ఇవి 12 రోజుల పాటు కొనసాగి 19వ తేదీతో ముగుస్తాయని ఈవో నరసయ్య తెలిపారు.



Updated Date - 2022-02-26T06:12:13+05:30 IST