సచివాలయాన్ని తనిఖీ చేసిన కలెక్టర్
ABN , First Publish Date - 2022-12-15T01:14:04+05:30 IST
పట్టణంలోని మండిగిరి గ్రామ సచివాలయాన్ని బుధవారం కలెక్టర్ పీ.కోటేశ్వర రావు తనిఖీ చేసి రికార్డులను పరిశీలించారు.
ఆదోని, డిసెంబరు 14: పట్టణంలోని మండిగిరి గ్రామ సచివాలయాన్ని బుధవారం కలెక్టర్ పీ.కోటేశ్వర రావు తనిఖీ చేసి రికార్డులను పరిశీలించారు. సచివాలయంలో పని చేస్తున్న సిబ్బందిని వివరాలు అడిగి తెలుసుకున్నారు. పనిలో నిర్లక్ష్యం వహిస్తే చూస్తూ ఊరుకోనని హెచ్చరించారు. ఆయన వెంట సబ్-కలెక్టర్ అభిషేక్ కుమార్ ఉన్నారు.