నిరాహార దీక్షకు తరలిన తెలుగు తమ్ముళ్లు

ABN , First Publish Date - 2022-12-15T23:51:39+05:30 IST

గని యజమానుల, కార్మికుల సమస్యల పరిష్కారం కోసం బనగానపల్లె ఎమ్మెల్యే బీసీ జనార్ధన్‌ రెడ్డి కొలిమిగుండ్ల మండలం బందార్లపల్లె గ్రామ సమీపంలోని చెక్‌పోస్టు వద్ద గురువారం చేపట్టిన నిరాహార దీక్షకు వివిధ గ్రామాలకు చెందిన టీడీపీ నాయకులు, కార్యకర్తలు భారీగా తరలివెళ్లారు. టీ

నిరాహార దీక్షకు తరలిన తెలుగు తమ్ముళ్లు

కోవెలకుంట్ల, డిసెంబరు 15: గని యజమానుల, కార్మికుల సమస్యల పరిష్కారం కోసం బనగానపల్లె ఎమ్మెల్యే బీసీ జనార్ధన్‌ రెడ్డి కొలిమిగుండ్ల మండలం బందార్లపల్లె గ్రామ సమీపంలోని చెక్‌పోస్టు వద్ద గురువారం చేపట్టిన నిరాహార దీక్షకు వివిధ గ్రామాలకు చెందిన టీడీపీ నాయకులు, కార్యకర్తలు భారీగా తరలివెళ్లారు. టీడీపీ మండల ఉపాధ్యక్షుడు కలుగొట్ల, లింగాల నాగార్జున రెడ్డి, వల్లంపాడు ఉప సర్పంచ్‌ గార్లపాటి జగదీశ్వర రెడ్డి, బీసీ సంఘం జిల్లా ఉపాధ్యక్షుడు లింగాల నాయుడు తరలివెళ్లిన వారిలో ఉన్నారు.

డోన్‌: నాపరాయి గనుల యజమానులు, కార్మికుల సమస్యలపై కొలిమిగుండ్ల మండలంలో టీడీపీ మాజీ ఎమ్మెల్యే బీసీ జనార్ధన్‌ రెడ్డి చేపట్టిన నిరాహారదీక్షకు టీడీపీ డోన్‌ ఇన్‌చార్జి ధర్మవరం సుబ్బారెడ్డి ఆధ్వర్యంలో గురువారం పార్టీ నాయకులు తరలివెళ్లారు. టీడీపీ రాష్ట్ర కార్యదర్శి వలసల రామకృష్ణ, మార్కెట్‌ యార్డు మాజీ చైర్మన్‌ మురళికృష్ణగౌడు, టీడీపీ జిల్లా అధికార ప్రతినిధి విజయభట్టు, ఎస్సీ సెల్‌ రాష్ట్ర అధికార ప్రతినిధి గంధం శ్రీనివాసులు, పట్టణ అధ్యక్షుడు సీఎం శ్రీనివాసులు, మండల అధ్యక్షుడు శ్రీనివాసులుయాదవ్‌, బీసీ సెల్‌ అధ్యక్షుడు ప్రజావైద్యశాల మల్లికార్జున, అభిరెడ్డిపల్లె గోవిందు, గండికోట రామసుబ్బయ్య, యాపదిన్నె సర్పంచ్‌ రామిరెడ్డి, కుమ్మరి సుధాకర్‌, మధుసూదన్‌ రెడ్డి, ఎల్‌ఐసీ శ్రీరాములు, కొచ్చెర్వు రామాంజినేయులు తరలివెళ్లారు.

Updated Date - 2022-12-15T23:51:42+05:30 IST