‘వచ్చే ఎన్నికల్లో టీడీపీదే అధికారం’

ABN , First Publish Date - 2022-07-18T06:05:38+05:30 IST

వచ్చే ఎన్నికల్లో టీడీపీ అధికారంలోకి రావడం ఖాయమని సీతారామాపురం టీడీపీ నాయకుడు, మాజీ సర్పంచ్‌ వెంకట్రాముడు ధీమా వ్యక్తం చేశారు.

‘వచ్చే ఎన్నికల్లో టీడీపీదే అధికారం’

బేతంచెర్ల, జూలై 17: వచ్చే ఎన్నికల్లో టీడీపీ అధికారంలోకి రావడం ఖాయమని సీతారామాపురం టీడీపీ నాయకుడు, మాజీ సర్పంచ్‌ వెంకట్రాముడు ధీమా వ్యక్తం చేశారు. మండలంలోని సీతారామాపురం, రుద్రవరం గ్రామాల్లో ఆదివారం టీడీపీ సభ్యత్వ నమోదు కార్యక్రమాన్ని ముమ్మరంగా చేపట్టారు. వెంకట్రాముడు మాట్లాడుతూ వైసీపీ అరాచక పాలనకు ప్రజలు విసిగి వేజారి పోయారని అన్నారు. ప్రజా సంక్షేమం, రాష్ట్రాభివృద్ధి టీడీపీతోనే సాధ్యమని అన్నారు. కార్యక్రమంలో ఆయా గ్రామాల టీడీపీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.


ప్రతి టీడీపీ కార్యకర్తకు టీడీపీ సభ్యత్వ నమోదు భరోసా ఉంటుం దని ప్రతి కార్యకర్త టీడీపీ సభ్యత్వ నమోదు తప్పనిసరిగా చేసుకోవాలని టీడీపీ బీసీ సెల్‌ అధ్యక్షుడు మండల గుడిసె మద్దిలేటి అన్నారు. ఆర్‌ఎస్‌ రంగాపురం గ్రామంలో టీడీపీ అధికార ప్రతినిధి లొడ్డ శేఖర్‌ ఆధ్వర్యంలో ఇంటింటికి తిరిగి సభ్యత్వ నమోదు కార్యక్రమాన్ని చేపట్టారు. కార్యక్రమంలో నల్లరెడ్డి గువ్వ వెంకటేశ్వర్లు, చంద్రశేఖర్‌ అధదిక సంఖ్యలో టీడీపీ కార్యకర్తలు పాల్గొన్నారు.

Read more