రక్తహీనత నివారణకు చర్యలు తీసుకోండి: కలెక్టర్‌

ABN , First Publish Date - 2022-08-31T05:46:05+05:30 IST

బాలింతలు, గర్భి ణుల్లో రక్తహీనతను నివారించేందుకు చర్యలు తీసు కోవాలని కలెక్టర్‌ మనజీర్‌ జిలానీ సామూన్‌ అంగ న్‌వాడీ కార్యకర్తలను ఆదేశించారు.

రక్తహీనత నివారణకు చర్యలు తీసుకోండి: కలెక్టర్‌

నంద్యాల టౌన్‌, ఆగస్టు 30: బాలింతలు, గర్భి ణుల్లో రక్తహీనతను నివారించేందుకు చర్యలు తీసు కోవాలని కలెక్టర్‌ మనజీర్‌ జిలానీ సామూన్‌ అంగ న్‌వాడీ కార్యకర్తలను ఆదేశించారు. మంగళవారం నంద్యాల మండలం చాపిరేవుల-1 గ్రామ అంగ న్‌వాడీ కేంద్రాన్ని కలెక్టర్‌ ఆకస్మికంగా తనిఖీ చేశా రు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ నవజాత శిశువులు, గర్భిణులు, బాలింతల ఆరోగ్య సంరక్షణ కోసం మెనూ ప్రకారం పౌష్టికాహారాన్ని అందించాలని సూపర్‌వైజర్లు, కార్యకర్తలను ఆదేశిం చారు. అంగన్‌వాడీ కేంద్రంలోని చంటి పిల్లల ఎదుగుదల మానిటరింగ్‌ రిజిస్టర్‌ను పరిశీలించారు. అందుబాటులో ఉన్న పిల్లల బరువును తూకం వేసి చూపించడంతో కలెక్టర్‌ పరిశీలించి సంతృప్తి వ్యక్తం చేశారు. ప్రభుత్వ ఆదేశాల ప్రకారం చాపిరేవుల - 1 కేంద్రం తరహాలో జిల్లా అంతటా ప్రవేశపెట్టేలా కార్యాచరణ ప్రణాళిక రూపొందించాలని ఐసీడీఎస్‌ జిల్లా డైరెక్టర్‌ లీలావతిని కలెక్టర్‌ ఆదేశించారు. కార్యక్రమంలో అర్బన్‌ సీడీపీవో ఉషారాణి, సూపర్‌వైజర్‌ విజయలక్ష్మి పాల్గొన్నారు.

Read more