‘అభివృద్ధి లక్ష్యాల సర్వేను వేగవంతం చేయాలి

ABN , First Publish Date - 2022-11-24T23:52:37+05:30 IST

సుస్థిర అభివృద్ది లక్ష్యాల అభివృద్దికి సంబంధించిన సర్వేను వేగవంతం చేయాలని రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సమీర్‌ శర్మ జిల్లా కలెక్టర్‌ మనజీర్‌ జిలానీ సామూనను ఆదేశించారు.

‘అభివృద్ధి లక్ష్యాల సర్వేను వేగవంతం చేయాలి

నంద్యాల టౌన, నవంబరు 24: సుస్థిర అభివృద్ది లక్ష్యాల అభివృద్దికి సంబంధించిన సర్వేను వేగవంతం చేయాలని రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సమీర్‌ శర్మ జిల్లా కలెక్టర్‌ మనజీర్‌ జిలానీ సామూనను ఆదేశించారు. గురువారం వెలగపూడి సచివాలయం నుంచి సుస్థిర అభివృద్ధి లక్ష్యాలు, జగనన్న గృహా నిర్మాణాల ప్రగతి, గర్భిణి, బాలింతల్లో రక్తహీనత, గడప గడపకు మన ప్రభుత్వంలో వచ్చిన దరఖాస్తులు తదితర అంశాలపై అన్ని జిల్లాల కలెక్టర్లతో సీఎస్‌ సమీర్‌శర్మ వీడియో కాన్ఫరెన్స ద్వారా సమీక్షించారు. నంద్యాల జిల్లా తరపున కలెక్టర్‌ మనజీర్‌ జిలానీ సామూన, డీఆర్వో పుల్లయ్య, హౌసింగ్‌ పీడీ రామశేషు, ఆర్‌డబ్ల్యుఎస్‌ ఎస్‌ఈ మనోహర్‌లు సీఎస్‌ సమీక్షకు హాజరయ్యారు. ఈ సందర్భంగా సమీర్‌ శర్మ మాట్లాడుతూ సుస్థిర అభివృద్ది లక్ష్యాల సాధనకు కలెక్టర్లు, సంబంధిత అధికారులు ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాలని, చిత్తశుద్ధితో పనిచేయాలని ఆదేశించారు. గడువులోగా జగనన్న లే అవుట్లలో గృహా నిర్మాణాలను ముమ్మరం చేసి పూర్తి చేసేందుకు ప్రత్యేక చర్యలు తీసుకోవాలని ఆదేశించారు.

బడి బయట ఉన్న పిల్లలను పాఠశాలల్లో చేర్పించండి

జిల్లాలో బడిబయట ఉన్న 4422మంది పిల్లలను వారం రోజుల్లో పాఠశాలల్లో చేర్పించేందుకు పగడ్బంది చర్యలు తీసుకోవాలని కలెక్టర్‌ మనజీర్‌ జిలానీ సామూన విద్యాశాఖ అధికారులను ఆదేశించారు. గురువారం విజయవాడలోని సమగ్ర శిక్షా కార్యాలయం నుంచి విద్యాశాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి బి.రాజశేఖర్‌ నాడు - నేడు పనుల పురోగతిపై అన్ని జిల్లాల కలెక్టర్లు, జిల్లా విద్యాశాఖ అధికారులు, ఇంజనీరింగ్‌ అధికారులతో వీడియో కాన్ఫరెన్స నిర్వహించారు. ఈ సందర్భంగా విద్యాశాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి రాజశేఖర్‌ మాట్లాడుతూ రెండో దశ మనబడి నాడు - నేడు కింద జూనియర్‌ కాలేజీల్లో ప్రాధాన్యత క్రమంలో పది కాంపోనెంట్లను పరిగణలోకి తీసుకొని పనులు వేగవంతంగా పూర్తి చేయాలని అన్ని జిల్లాల కలెక్టర్లకు సూచించారు. విద్యార్థుల అవసరాలను దృష్టిలో ఉంచుకొని చేపట్టిన పనులను త్వరితగతిన పూర్తి చేయాలన్నారు. పనుల్లో రాజీ పడకుండా నాణ్యత ప్రమాణాలు పాటించేలా చర్యలు తీసుకోవాలని సూచించారు. కలెక్టర్‌ మాట్లాడుతూ బడిబయట ఉన్న 4422మంది పిల్లల్లో ఇంతవరకు కేవలం 342మంది పిల్లలు మాత్రమే పాఠశాలల్లో చేర్పించారని, మిగిలిన పిల్లలందరిని వారంరోజుల్లో పాఠశాలల్లో చేర్చాలని మండల విద్యాశాఖ అధికారులకు, క్లస్టర్‌ రీసోర్స్‌పర్సనలకు ఆదేశాలు జారీ చేయాలని డీఈవోను ఆదేశించారు. జగనన్న విద్యాకానుక కిట్లు 100శాతం పంపిణీ చేసినప్పటికీ యూనిఫామ్‌, షూస్‌, బయో మెట్రిక్‌ హాజరు పెండింగ్‌ సమస్యను 3రోజుల్లో అధిగమించాలని సూచించారు. సమగ్ర శిక్ష అభియాన కింద చేపడుతున్న కార్యకలాపాలను వేగవంతంగా, సమర్థవంతంగా పూర్తి చేయాలని కలెక్టర్‌ సంబంధిత అధికారులను ఆదేశించారు.

Updated Date - 2022-11-24T23:52:37+05:30 IST

Read more