నాటు సారా తయారీకి స్వస్తి పలకండి

ABN , First Publish Date - 2022-12-14T23:13:38+05:30 IST

నాటు సారా తయారీకి స్వస్తి పలికి మంచి మార్గాన్ని ఎన్నుకోవాలని కలెక్టర్‌ కోటేశ్వరరావు అన్నారు.

నాటు సారా తయారీకి స్వస్తి పలకండి

కర్నూలు (కలెక్టరేట్‌) డిసెంబరు 14: నాటు సారా తయారీకి స్వస్తి పలికి మంచి మార్గాన్ని ఎన్నుకోవాలని కలెక్టర్‌ కోటేశ్వరరావు అన్నారు. బుధవారం కలెక్టరేట్‌లోని కాన్ఫరెన్స హాల్లో నాటు సారా తయారీ నిర్మూలన- పరివర్తన ప్రత్యామ్నాయ కార్యక్రమంలో అడిషనల్‌ ఎస్పీతో కలిసి కలెక్టర్‌ పాల్గొన్నారు. ఈ సందర్భంగా కలెక్టర్‌ మాట్లాడుతూ నాటు సారా తయారీదారుల్లో పరివర్తన వస్తే ప్రత్యామ్నాయ జీవనోపాధి కల్పిస్తున్నామన్నారు. జిల్లాలో 11మండలాల్లోని 64 మందికి రూ.54 లక్షల 2 వేల రూపాయల వడ్డీ లేని రుణాలను పంపిణీ చేస్తున్నామని తెలిపారు. సంక్షేమ పథకాలు సద్వినియోగం చేసుకుని గౌరవంగా బతకాలని సూచించారు. అడిషనల్‌ ఎస్పీ మాట్లాడుతూ నాటు సారా తయారీ మానుకొని జనజీవన స్రవంతిలోకి రావాలని కోరారు.

Updated Date - 2022-12-14T23:13:39+05:30 IST