‘నిరుద్యోగుల కడుపు కొట్టొద్దు’

ABN , First Publish Date - 2022-01-13T05:44:25+05:30 IST

ఉద్యోగుల రిటైర్మెంట్‌ వయస్సు పెంచి నిరుద్యోగుల కడుపు కొట్టవద్దని నిరుద్యోగ జిల్లా జేఏసీ నాయకుడు దేవరాజు ఆవేదన వ్యక్తం చేశారు.

‘నిరుద్యోగుల కడుపు కొట్టొద్దు’


సంజామల, జనవరి 12: ఉద్యోగుల రిటైర్మెంట్‌  వయస్సు పెంచి నిరుద్యోగుల కడుపు కొట్టవద్దని నిరుద్యోగ జిల్లా జేఏసీ నాయకుడు దేవరాజు ఆవేదన వ్యక్తం చేశారు. బుధవారం ఆయన విలేఖరులతో మాట్లాడుతూ  గతంలో 55 సంవత్సరాలకు ఉన్న రిటైర్మెంట్‌  వయస్సును గత ప్రభుత్వం 60 సంవత్సరాలకు పెంచగా, ప్రస్తుత జగన ప్రభుత్వం 62 సంవత్సరాలకు పెంచిందని అన్నారు. ఇది నిరుద్యోగుల కడుపు కొట్టడమేనని ఆయన ఆందోళన వ్యక్తం చేశారు. అధికారంలోకి వచ్చిన ప్రతి ప్రభుత్వం ఉద్యోగుల రిటైర్మెంట్‌ 2 సంవత్సరాలు పెంచుకుంటూ పోతే నిరుద్యోగుల భవిష్యత ఏమిటని ప్రశ్నించారు.  


Updated Date - 2022-01-13T05:44:25+05:30 IST