ముగిసిన రాష్ట్ర స్థాయి ఫెన్సింగ్‌ లీగ్‌ పోటీలు

ABN , First Publish Date - 2022-03-05T05:52:37+05:30 IST

: నంద్యాల పట్టణం పద్మావతినగర్‌లో ఉన్న ఇండోర్‌ స్టేడియంలో జూనియర్‌ బాల, బాలికల రాష్ట్రస్థాయి ఫెన్సింగ్‌ లీగ్‌ పోటీలు శుక్రవారంతో ముగిశాయి.

ముగిసిన రాష్ట్ర స్థాయి ఫెన్సింగ్‌ లీగ్‌ పోటీలు

నంద్యాల(నూనెపల్లె), మార్చి 4: నంద్యాల పట్టణం పద్మావతినగర్‌లో ఉన్న ఇండోర్‌ స్టేడియంలో జూనియర్‌ బాల, బాలికల రాష్ట్రస్థాయి ఫెన్సింగ్‌ లీగ్‌ పోటీలు శుక్రవారంతో ముగిశాయి. జిల్లా క్రీడా ప్రాథికార సంస్థ ఆధ్వర్యంలో జరిగిన పోటీల్లో రాష్ట్రవ్యాప్తంగా 200మంది క్రీడాకారులు పాల్గొన్నారు. ముగింపు కార్యక్రమానికి ఐఎంఏ రాష్ట్ర అధ్యక్షుడు డాక్టర్‌ రవికృష్ణ, జిల్లా ఆర్యవైశ్య సంఘం నాయకులు, కౌన్సిలర్‌ ఖండే శ్యామ్‌సుందర్‌ లాల్‌, డాక్టర్‌ బద్రీష్‌ ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. ఈపీ, ఫాయిల్‌, సేబర్‌ విభాగాలలో విజేతలుగా నిలిచిన క్రీడాకారులకు అతిథులు మెమెంటోలు, ప్రశంస పత్రాలు, మెడల్స్‌ అందజేశారు. ఈ కార్యక్రమంలో ఫెన్సింగ్‌ కోచ్‌, టోర్నమెంట్‌ కన్వీనర్‌ మహేశ్వరరావు, ఫెన్సింగ్‌ అసోసియేషన్‌ సభ్యులు సతీ్‌షబాబు, క్రిష్టఫర్‌, కోచ్‌లు పాల్గొన్నారు. 


 


Read more