Srisailam Reservoir: శ్రీశైలం జలాశయం రెండు గేట్లు ఎత్తివేత

ABN , First Publish Date - 2022-08-07T21:19:19+05:30 IST

Srisailam Reservoir: శ్రీశైలం జలాశయం రెండు గేట్లు ఎత్తివేత

Srisailam Reservoir: శ్రీశైలం జలాశయం రెండు గేట్లు ఎత్తివేత

కర్నూలు: శ్రీశైలం జలాశయం (Srisailam Reservoir) రెండు గేట్లను అధికారులు ఎత్తివేశారు. జూరాల, సుంకేశుల నుంచి శ్రీశైలానికి 1,08,694 క్యూసెక్కుల ప్రవాహం వస్తోంది. ఎగువ నుంచి నీరు రావడంతో పూర్తిస్థాయి నీటిమట్టంతో శ్రీశైలం జలాశయం కళకళలాడుతోంది. కుడి, ఎడమ జలవిద్యుత్‌ కేంద్రాల్లో విద్యుదుత్పత్తి కొనసాగుతుంది. అలాగే ప్రకాశం బ్యారేజీ (Prakasam Barrage) 50 గేట్లు ఎత్తివేశారు. అడుగు మేర గేట్లు ఎత్తి 46,682 క్యూసెక్కులు నీటిని దిగువకు విడుదల చేశారు. 


మరోవైపు రాష్ట్రంలో ఆదివారం భారీ నుంచి అతి భారీ వర్షాలు, సోమవారం అత్యంత భారీ వర్షాలు (Heavy rains) కురిసే అవకాశం ఉందని హైదరాబాద్‌ వాతావరణ కేంద్రం హెచ్చరించింది. రాగల మూడు రోజుల పాటు గంటకు 30-40 కిలోమీటర్ల వేగంతో ఈదురు గాలులు వీచే అవకాశం ఉందని తెలిపింది. రాగల 24 గంటల్లో వాయవ్య బంగాళాఖాతం పరిసర ప్రాంతాల్లో అల్పపీడనం ఏర్పడే అవకాశం ఉన్నట్లు వెల్లడించింది. ఆదివారం ఆసిఫాబాద్‌, మంచిర్యాల, జగిత్యాల, సిరిసిల్ల, కరీంనగర్‌, పెద్దపల్లి, భూపాలపల్లి, ములుగు, భద్రాద్రి కొత్తగూడెం, మహబూబాబాద్‌, వరంగల్‌ అర్బన్‌, వరంగల్‌ రూరల్‌ జిల్లాలకు ఆరెంజ్‌ అలర్ట్‌ జారీ చేసింది. ఈ జిల్లాల్లో భారీ నుంచి అతిభారీ వర్షాలు పడొచ్చని పేర్కొంది.

Updated Date - 2022-08-07T21:19:19+05:30 IST