ఇళ్ల నిర్మాణాన్ని వేగవంతం చేయండి: కలెక్టర్
ABN , First Publish Date - 2022-12-31T01:01:40+05:30 IST
ఇళ్ల నిర్మాణాలను వేగవంతం చేయాలని హౌసింగ్ అధికారులను కలెక్టర్ పి. కోటేశ్వరరావు ఆదేశించారు.
కర్నూలు(కల్చరల్), డిసెంబరు 30: ఇళ్ల నిర్మాణాలను వేగవంతం చేయాలని హౌసింగ్ అధికారులను కలెక్టర్ పి. కోటేశ్వరరావు ఆదేశించారు. శుక్రవారం కల్లూరు మండలం, చెట్లమల్లాపురం గ్రామంలోని పేదలకు నవరత్నాలు పథకంలో భాగంగా జగనన్న కాలనీల్లో నిర్మిస్తున్న ఇళ్ల నిర్మాణాల పురోగతిని ఆయన పరిశీలించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ నవరత్నాలు పేదలందరికీ ఇళ్లు పథకంలో జగనన్న కాలనీల్లో చేపడుతున్న ఇళ్ల నిర్మాణాల్లో భాగంగా మొత్తం 47 ఇంటి స్థలాలను పంపిణీ చేశామని, వాటిలో 29 బిలో బేస్‌మెంట్ లెవల్‌లో ఉండటంతోపాటు 4 రూప్ లెవెల్‌లో ఉన్నాయ న్నారు. బిలో బేస్‌మెంట్ స్థాయిలో ఉన్నవి కూడా త్వరగా పూర్తి చేసేందుకు చర్యలు తీసుకోవాలని హౌసింగ్ డీఈని ఆదేశించారు. జగనన్న కాలనీల కోసం బహిరంగ మార్కెట్ ధరల కంటే సిమెంట్, స్టీల్, ఇటుకలు సబ్సిడీ ధరల్లో ఇస్తామని అన్నారు. ప్రభుత్వం అందించే నగదుతోపాటూ స్వయం సహాయక సం ఘాల మహిళలకు బ్యాంకు రుణాలు కూడా ఇస్తామని అన్నారు. జగనన్న కాలనీల్లో ఇళ్లు నిర్మించుకుంటున్న లబ్ధిదారుల ఖాతాల్లో నగదు కూడా జమ చేశామన్నారు. కార్యక్రమంలో కలెక్టర్ వెంట గ్రామ సర్పంచ్ ఎస్ భూపాల్‌రెడ్డి, హౌసింగ్ డీఈ నాగరాజు, కల్లూరు తహసీల్దారు రమేశ్‌బాబు, ఎంపీడీవో రమణమూర్తి పాల్గొన్నారు.