కాంగ్రె్స తోనే ప్రత్యేక హోదా
ABN , First Publish Date - 2022-10-17T05:39:01+05:30 IST
రాష్ర్టానికి ప్రత్యేకహోదా, పోలవరం ప్రాజెక్టు, రాయలసీమకు బుందేల్కండ్ తరహా ప్యాకేజీ వంటివి కాంగ్రె స్ పార్టీతోనే సాధ్యమని ఏఐసీసీ నాయకుడు, మాజీ మంత్రి జేడీ శీలం అన్నారు.
దేశాన్ని ఏకం చేయటమే రాహుల్ పాదయాత్ర లక్ష్యం
భారత్ జోడో యాత్రను విజయవంతం చేయండి
ఏఐసీసీ నాయకులు జేడీ శీలం, గిడుగు రుద్రరాజు, కొప్పల రాజు పిలుపు
ఎమ్మిగనూరు, అక్టోబరు 16: రాష్ర్టానికి ప్రత్యేకహోదా, పోలవరం ప్రాజెక్టు, రాయలసీమకు బుందేల్కండ్ తరహా ప్యాకేజీ వంటివి కాంగ్రె స్ పార్టీతోనే సాధ్యమని ఏఐసీసీ నాయకుడు, మాజీ మంత్రి జేడీ శీలం అన్నారు. ఆదివారం ఎమ్మిగనూరులో కాంగ్రెస్ పార్టీ నియోజకవర్గ ఇన్చార్జి కే లక్షీనారాయణరెడ్డి స్వగృహంలో రాహుల్‌గాంధీ చేపట్టిన భారత్జోడ్ యాత్ర పోస్టర్లును పార్టీ నాయకులు విడుదల చేశారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన విలేఖరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ సమాజాన్ని ఏకం చేసేందుకే రాహుల్ గాంఽధీ భారత్‌జోడో యాత్రచేస్తున్నారన్నారు. గిడుగు రుద్రరాజు మాట్లాడుతూ 130కోట్ల జనాభా మధ్య బీజేపీ అవాంతరాలు సృష్టించి విడగొ ట్టేందుకు ప్రయత్నిస్తుండగా దేశాన్ని, ప్రజలను ఏకం చేసేందుకు రాహుల్ గాంధీ పాదయాత్ర చేస్తున్నారని అన్నారు. కొప్పల రాజు మాట్లాడుతూ కేంద్రంలో బీజేపీ అధికారంలోకి వచ్చిన ఈ ఎనిమిదేళ్లలో ప్రజల మధ్య ఆర్థిక అంతరాలు పెరిగిపోయాయని విమర్శించారు. పార్లమెంట్లో ప్రతిపక్షాల గొంతునొక్కటంతో చేసేది లేక నేరుగా ప్రజలను చైతన్యవంతం చేయడానికి రాహుల్ గాంధీ ప్రజల మధ్యకు వచ్చారన్నారు. ఈ సమావేశంలో ఎమ్మిగనూరు కాంగ్రెస్ పార్టీ ఇన్చార్జి లక్ష్మీనారాయణరెడ్డి, డీసీసీ కార్యదర్శి కాశీం వలి, ఎస్ఎ్సయుఐ రాష్ట్ర కార్యదర్శి నాగమధుసుధ యాదవ్, ఆయా నియోజకవర్గాల ఇన్చార్జులు అరుణకుమారి, ముళీధర్, ప్రకాష్, బండిజకరయ్య, సాయిబాబా, రాజు, ఎన్‌ఎ్‌సయూఐ జిల్లా అధ్యక్షుడు వీరేష్ యాదవ్ పాల్గొన్నారు.
పాదయాత్ర ఇలా
రాహుల్ గాంధీ భారత్ జోడో యాత్ర ఈనెల 18న కర్నూలు జిల్లా హాలహర్వి మండలం క్షేత్రగుడి దగ్గర ప్రవేశి స్తుంది. 18వ తేదీ ఉదయం 6.30 గంటల నుంచి సాయంత్రం 7.30 గంటలకు ఆలూరు మండలం మణేకుర్తి గ్రామం వరకు సాగుతుంది. 19వ తేదీ ఉదయం 6.30 గంట లకు ప్రారంభమై 10.30గంటలకు ఆదోనిలోని ఆర్స్ట్ కళాశాలకు చేరుకుంటుంది. అక్కడ ప్రెస్ మీట్లో రాహుల్ పాల్గొంటారు. సాయంత్రం 7.30 గంటలకు ఆరెకల్ గ్రామానికి చేరుకుంటారు. 20వ తేదీ ఎమ్మిగనూరు మండలంలోని చెన్నపురం గ్రామం అడ్డ రోడ్డు నుంచి పాదయాత్ర ప్రారంభమమై ఎమ్మిగనూరు పట్టణం, ముగతి సర్కిల్, ధర్మాపురం వరకు సాగుతుంది. తిరిగి సాయంత్రం 4.30 గంటలకు ప్రారంభమై సాయంత్రం 7.30 గంటలకు మంత్రాలయం మండలం కలుదేవకుంట గ్రామానికి చేరుకుంటుంది. 21వ తేదీ ఉదయం 6.30 గంటలకు మంత్రాలయంలోని సర్కిల్ నుంచి ప్రారంభమై 10.30 గంటలకు మాధవరం మీదుగా కర్ణాటక రాష్ట్రంలోకి ప్రవేశిస్తుంది.